ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం రొమాంటిక్ కామెడీ 'దోస్తానా-2' సినిమా గురించి చర్చిస్తోంది. ఇప్పటికే కరణ్ జోహార్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ దోస్తానా 2008లో ఎన్నో విమర్శలకు దారితీసింది. ఆ సినిమాలో హీరోలుగా నటించిన జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా స్వలింగ సంపర్కులుగా నటించారు. కానీ ఆ సినిమా ఎన్నో నెగటివ్ పరిణామాలకు తెరలేపింది. కానీ నిర్మాత కరణ్ జోహార్.. ఆ సినిమాను కేవలం లైంగికత పై ఓ వ్యంగ్య ప్రస్తావనగా చెప్పుకొచ్చాడు. అయినా విమర్శలు తప్పలేదు. దాదాపు మొదటి పార్ట్ వచ్చిన పన్నెండు సంవత్సరాలకు సీక్వెల్ దోస్తానా-2 తెరకెక్కుతుండటం విశేషం. అందులోను ఈ సినిమాలో యంగ్ టాలెంట్స్ కార్తీక్ ఆర్యన్, జాన్వీకపూర్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు.
అయితే దోస్తానా-2 కూడా మొదటి సినిమాలాగే లైంగికత పై, స్వలింగ సంపర్కం అనే టాపిక్ వ్యంగ్యంగా టచ్ చేస్తుందని గతంలో చెప్పాడు ప్రొడ్యూసర్ కరణ్. కానీ ఇప్పుడు సినిమాలో ఆ సబ్జెక్టు తొలగించి భారీ మార్పులు చేస్తున్నట్లు టాక్. నిజానికి దోస్తానా-2 కథ విషయానికి వస్తే.. కార్తీక్ ఆర్యన్, జాన్వీకపూర్ ఇద్దరూ అన్నచెల్లెలిగా నటిస్తుండగా.. వీరిద్దరూ కలిసి ఒకే అబ్బాయిని ప్రేమించడం అనేది ముఖ్యకథగా కథనాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి స్టోరీ వద్దని.. అసలే జనాలు తన పై నెగటివ్ అభిప్రాయంతో ఉన్నారనే ఉద్దేశంతో కరణ్ సినిమా స్టోరీలో మార్పులు సూచించినట్లు తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో గే స్టోరీతో వస్తే బాగోదని.. దోస్తానా-2 డైరెక్టర్ కొలిన్ డి కున్హాతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఇప్పటికే సినిమా సగం షూటింగ్ ముగించుకుందట. మరి సినిమాలో ఎలాంటి మార్పులు జరిగాయో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.