ఖాదీ చీరలో కరీనా.. అదిరిందంతే

Update: 2017-09-20 17:10 GMT
ఇండియాలో కరీనా పేరు తెలియని యువకులు ఉండరనే చెప్పాలి. గతంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కరీనా కపూర్ ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకొని ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల వరకు ఫ్యామిలీ తో హ్యాపీగా ఎంజాయ్ చేసిన కరీనా ఇప్పుడు మళ్లీ తన గత వైభవాన్ని చూపిస్తోంది. పెళ్లి అయ్యింది కరినాకే గాని కరీనా అందాలకు కాదంటోంది.

ఈ మధ్య ఈ బాలీవుడ్ బ్యూటీ ఫోటోషూట్స్ తో తెగ హల్ హాల్ చేస్తోంది. ఘాటుగానే కనిపిస్తూ.. కాస్త పద్దతిగా నే ఉంటోంది. ఇక ఎక్కడైనా కెమెరాలు ముందు దర్శనం ఇస్తే చాలు సెక్సీ స్టిల్స్ ఇచ్చేస్తోంది. కెమెరాలకు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా తన చిరునవ్వుతో అందరిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఓ ప్రయివేట్ కంపెనీకి ప్రమోషన్స్ నిర్వహించిన కరీనా ఖాదీ చీరలో అందంగా దర్శనం ఇచ్చింది. మన దగ్గర ఖాదీ బ్రాండ్ అంబాసిడర్ల కద్దర్ తో బికినీలు చేయించుకుని సోకులను ఆరబోస్తున్నారు కాని.. అక్కడ అమ్మడు మాత్రం చీరలనో ఉతికి ఆరేస్తోంది.

అలాగే వెరైటీ హెయిర్ స్టైల్ తో కరీనా చాలా కొత్తగా కనిపించింది. దీంతో అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న కరీనా ఇంకా ఇరవై దాటినా హీరోయిన్ లా ఉందంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఇక అమ్మడు చాలా రోజుల తర్వాత "వీరే ది వెడ్డింగ్" అనే సినిమా ద్వారా మళ్లీ వెండితెరపై మెరువబోతోంది.
Tags:    

Similar News