సరిలేరు నీకెవ్వరు మూవీ కి వెళ్లినందుకు హీరోయిన్ కు పోలీసులు నోటీసులు!!
అదేంటీ సినిమాకు వెళ్తే పోలీసులు నోటీసులు ఎందుకు ఇస్తారంటూ ఆశ్చర్యపోతున్నారా.. సినిమాకు వెళ్లినందుకు కాదు కాని సినిమాకు వెళ్తున్న సమయంలో కారు డ్రైవ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం.. ఆ వీడియోను పోలీసులు చూడటం ఆ విషయమై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ సంజన ఇటీవల బెంగళూరులో సరిలేరు నీకెవ్వరు చిత్రం చూసేందుకు ఓపెన్ టాప్ కారులో బయలుజేరింది. ఆమె డ్రైవ్ చేస్తూ సెల్ఫీ వీడియో లో నాకు ఇష్టమైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా చూసేందుకు వెళ్తున్నాను. గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అంటూ తన అంతులేని ఆనందాన్ని ఆపుకోలేక డ్రైవింగ్ చేస్తూనే సెల్ఫీ వీడియో ద్వారా షేర్ చేసుకునే ప్రయత్నం చేసింది.
మామూలుగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ చూడటం లేదా కాల్ మాట్లాడటమే తప్పు అంటే సంజన ఏకంగా డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా చూసేందుకు వెళ్తున్నట్లు గా ఆమె సంతోషంగా చెప్పడం మహేష్ బాబు ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. కాని పోలీసులకు మాత్రం ఆమె డ్రైవ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీయడం నచ్చలేదు. అందుకే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించారు.
పోలీసుల నోటీసులకు స్పందించిన సంజన ప్రస్తుతం తాను షూటింగ్ నిమిత్తం దుబాయిలో ఉన్నాను. వచ్చిన తర్వాత తప్పకుండా మీ ముందు హాజరు అవుతాను అంటూ పేర్కొందట. సెల్ఫీ వీడియోపై నెటిజన్స్ కొందరు తీవ్ర స్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ సరదాతో ఇతరుల ప్రాణాలు తీస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు.