కార్తీ జపాన్ లుక్ అదిరింది

Update: 2023-01-16 04:57 GMT
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ప్రస్తుతం జపాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది విరుమన్, సర్దార్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో కార్తి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూడు సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సర్దార్ మూవీతో సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ కొట్టాడు.

ఈ సినిమాలో విక్రమ్, జయం రవి తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ కార్తిదే. ఈ క్యారెక్టర్ లో ఓ వైపు కామెడీ పండుస్తూనే మరో వైపు యాక్షన్ తో కూడా కార్తి ఇరగదీసాడు. ఇదిలా ఉంటే రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తి జపాన్ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ టచ్ తో కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక వెరైటీ లుక్ వచ్చింది.

తాజాగా సంక్రాంతి సందర్భంగా చిత్ర నిర్మాతలైన డ్రీమ్ వారియర్ నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రెడ్ కలర్ డ్రెస్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో పాతకాలంలో మెయిన్ విలన్ దగ్గర ఉండే గ్యాంగ్ లో విలన్ తరహా గెటప్ లో కనిపించాడు. స్టైలిష్ గా నిలబడి సీరియస్ లుక్ గతో ఉన్న ఈ ఫోటో సినిమా ఎలా ఉండబోతుందని అనేది చెప్పకనే చెబుతుంది. కచ్చితంగా ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుకునే విధంగా ఈ మూవీ కథాంశం ఉండబోతుందని కార్తి పోషిస్తున్న జపాన్ లుక్ చూస్తేనే తెలుస్తుంది.

కోలీవుడ్ లో కార్తి అంటే మంచి కామెడీ టైమింగ్ ఉన్న కథలు కనిపిస్తాయి. తెలుగులో కూడా ఊపిరి సినిమాలో కార్తి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరూ టేస్ట్ చేశారు. ఇప్పుడు జపాన్ తో ఫుల్ లెంత్ లో కామెడీ యాక్షన్ హీరోగా రాబోతున్న కార్తి ఏ విధంగా ప్రేక్షకులని మెప్పిస్తాడు అనేది చూడాలి.ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుతెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News