సెలబ్రిటీల ఇంట పెళ్లిళ్లు అంటే ఖర్చు అంబరాన్ని అంటాల్సిందే. లగ్జరీ ఈవెంట్ విషయంలో రాజీ ఉండదు. మొహందీ దగ్గర నుంచి పెళ్లి తంతు పూర్తయ్యేవరకూ వరకూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ వివాహం డిసెంబర్లో జరగనున్న నేపథ్యంలో పలు సెలబ్రిటీ వెడ్డింగ్స్ కి సంబంధించిన పెళ్లి ఖర్చు వివరాలపై చర్చ సాగుతోంది.
విక్కీ - క్యాట్ వివాహం రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారా వేదిక గా జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు.. అతికొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు.. సన్నిహితులు సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? అన్నది హాజరయ్యే అతిథుల్ని బట్టి తెలుస్తుంది.
అయితే ఇక్కడ ఒక వ్యక్తికి ఒక రాత్రి ఖర్చు అక్షరాల 77000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి విక్కీక్యాట్ వివాహానికి ఎంత ఖర్చు అవుతుందన్నది అటెండెన్స్ ని బట్టి లెక్క తేలాల్సి ఉంటుంది. ఆ సంగతిని పక్కనబెడితే ఈ జంట పెళ్లి నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ కపుల్స్ కొంతమంది సెలబ్రిటీ పెళ్లిళ్లకు ఎంత ఖర్చు అయింది! అన్న వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ వివాహానికి భారీగా ఖర్చు అయింది. వీరిద్దరి వివాహం జోధ్ పూర్ లో జరిగింది. అందుకు అయిన ఖర్చు 5 కోట్లు. జోధ్ పూర్ ప్యాలెస్ కే 3 కోట్ల వరకూ ఖర్చు అయిందని ఉమైద్ భవన్ అధికారులు తెలిపారు.
వేడుకకు అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఇక దీపికా పదుకొణే- రణవీర్ సింగ్ వివాహానికి 77 కోట్లు ఖర్చు అయిందిట. ఆ తర్వాత విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ పెళ్లి ఖర్చులు అన్ని కలిపి దాదాపు 100కోట్లు అయిందిట. ఇటలీలోని టుస్కానీలోని బోర్గో ఫినోచిటోల్ లో ఈ వివాహం జరిగింది.
అక్కడ ఒక్కో సబ్యుడి ఖర్చు 1 కోటి. మొత్తం 44 మంది హాజరయ్యారు అంటే 44 కోట్లు అక్కడే అయింది. ఇంకా ఆ తర్వాత ముంబైలో రిసెప్షన్..హనీమూన్ ఇతర ఖర్చులు కలిపి మొత్తం 100 కోట్లు అయింది. బాలీవుడ్ సెలబ్రిటీలలో పెళ్లికి 100 కోట్లు ఖర్చు చేసిన తొలి జంట కూడా విరుష్కనే కావడం విశేషం. మరి విక్కీక్యాట్ ల వివాహానికి ఎంత ఖర్చు అవుతుందన్నది చూడాలి. 100 కోట్లు పైగా ఖర్చు చేస్తారా? అంటూ గుసగుస వైరల్ అవుతోంది.