ఆస్కార్ వేదిక‌పై కీర‌వాణి అరుదైన ఫీట్?

Update: 2023-02-08 13:14 GMT
ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండర్ 'RRR' వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించ‌డ‌మే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే దేశ విదేశాల్లోనూ ఊహకంద‌ని స్థాయిలో వసూళ్ల‌తో పాటు క్రేజ్ ని ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల్ని ద‌క్కించుకుంటూ RRR స‌త్తా చాటుకుంటోంది. ఇప్ప‌టికే ఎన్నో అవార్డుల్ని ద‌క్కించుకుంటూ వ‌రుస‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

ఇండియ‌న్ సినిమా స‌త్తా ఏంటో చూపిస్తూ అంత‌ర్జాతీయంగా వ‌రుస అవార్డుల్ని ద‌క్కించ‌కుంటున్న 'RRR' ఆస్కార్ అవార్డులకు ఇటీవ‌ల షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా 'నాటు నాటు' సాంగ్ కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా క్రిటిక్స్ ఛాయ‌స్‌, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్, జ‌పాన్ 46వ అకాడ‌మీ అవార్డ్స్ లో అవుట్ స్టాండిగ్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీ విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు హాలీవుడ్ ప్ర‌ముఖులంతా అత్యంత ప్ర‌తిస్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో వుంది. ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో RRR ఫైన‌ల్ లిస్ట్ లో షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. మ‌రి కొన్ని రోజుల్లో అంటే మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఈ అవార్డు వేడుక అత్యంత అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. ఇందులో ప్ర‌ముఖ హాలీవుడ్ స్టార్స్‌, డైరెక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ భారీ స్థాయిలో పాల్గొన‌బోతున్నారు.

95వ ఆస్కార్ అవార్డుల వేడుక కోసం యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌తో పాటు ఈ సారి ప్ర‌త్యేకంగా మ‌న ఇండియ‌న్ ప్రేక్ష‌కులు కూడా అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ అవార్డుల్లో ఖ‌చ్చితంగా అనుకున్న‌ట్టుగానే 'RRR' ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' సాంట్ కు గానూ ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ పుర‌స్కారాన్ని ద‌క్కించుకుంటుందా? అని అంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇండియ‌న్ ప్రేక్ష‌కుల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

ఇదిలా వుంటే అత్యంత ప్ర‌తిష్టాత్మంగా మార్చి 12న జ‌ర‌గ‌నున్న 95వ ఆస్కార్ పుర‌స్కార వేడుక‌లో కీర‌వాణి అరుదైన ఫీట్ కు రెడీ అవుతున్నారే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ అవార్డుల వేడుక‌లో 'నాటు నాటు' సాంగ్ ని ప్ర‌ద‌ర్శించ‌మని సంగీత దర్శ‌కుడు కీర‌వాణితో పాటు గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ కు ఆస్కార్ క‌మిటీ నుంచి ఆహ్వానం అందిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో 'స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్‌' కోసం 'జ‌య‌హో' సాంగ్ కు అవార్డుల‌ని అందుకున్న క్ర‌మంలో రెహ‌మాన్ ని కూడా ఆస్కార్ క‌మిటీ ఇదే త‌ర‌హాలో ఆహ్వానాన్ని అందించి లైవ్ ప్ర‌ద‌ర్శ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మ‌ళ్లీ ఇన్నాళ్లుకు అ అరుదైన ఫీట్ కోసం కీర‌వాణి కి ఆస్కార్ క‌మిటీ ఆహ్వానం ప‌ల‌క‌డం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News