కొన్ని అంతే చేతిదాకా వచ్చి నోటికి అందవు. కీర్తి సురేష్ పరిస్థితి చూస్తే అచ్చం అలాగే ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు మురుగదాస్ కాంబోలో రూపొందబోయే తలైవా 166వ సినిమాలో తొలుత నయనతార కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తారనే ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో నయన్ మాత్రమే ఉంటుందట. నిజానికి కీర్తి పేరు బయటికి వచ్చినప్పుడు వయసు దృష్ట్యా మరీ లేతగా అనిపించే తను రజని పక్కన సూటవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అంతే కాదు కూతురి కంటే చిన్న వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ ఏంటి రజని అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం వచ్చాయి. కారణం ఏదో స్పష్టంగా బయటికి రాలేదు కానీ మొత్తానికి కీర్తి సురేష్ అందులో లేదనే టాక్ చెన్నైలో బలంగా నడుస్తోంది
నయనతార విషయంలో ఈ అభ్యంతరం లేదు. ఎందుకంటే దశాబ్దం క్రితమే రజనితో చంద్రముఖిలో నటించి మొదటి బ్రేక్ అందుకుంది. డ్యూయెట్స్ లో ఆడి పాడింది. సో ఎవరూ ఏమి అనే ఛాన్స్ లేదు. పోలీస్ ఆఫీసర్ గా రజని నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కాబోతున్నట్టు టాక్.
అనిరుద్ రవిచందర్ ట్యూన్స్ కంపోజింగ్ కూడా అయిపోయిందని తెలిసింది. కీర్తి సురేష్ పాత్రను పూర్తిగా డిలీట్ చేశారా లేక ఎవరైనా సీనియర్ హీరోయిన్ ని దాని కోసం రీ ప్లేస్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. దీపావళి విడుదలకు టార్గెట్ చేసుకున్న ఈ మూవీకి నర్కలి అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది దాన్ని యూనిట్ ఖండించింది