కీర్తి సురేశ్ ప్రధాన పాత్రను పోషించిన 'గుడ్ లక్ సఖి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మించాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ గిరిజన యువతిగా కనిపిస్తుంది. ఊళ్లో వాళ్లంతా కూడా ఆమెను ఐరన్ లెగ్ గా చూస్తుంటారు. ఆమె ఎదురొస్తే ఎలాంటి పనైనా ఆగిపోవలసిందే .. ఎలాంటివారైనా నష్టాలపాలు కావలసిందే. ఈ విషయాలను ఒక పాటలో చూపించేశారు కూడా. అందువలన ఆమె కనిపిస్తే చాలు వాళ్లంతా కంగారు పడిపోతుంటారు. త్వరగా పెళ్లి చేసుకుని తమ ఊరు నుంచి ఎప్పుడు వెళ్లిపోతావని అడుగుతుంటారు.
అలా అంతా ఒక నష్ట జాతకురాలుగా చూసే ఒక యువతి, అంతర్జాతీయ స్థాయిలో ఆ ఊరికి ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందనేదే ఈ కథ. ఈ సినిమాను గురించి కీర్తి సురేశ్ మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో తాను కూడా ఐరన్ లెగ్ అనే విమర్శలను ఎదుర్కొన్నానని చెప్పింది. "మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నా కెరియర్ మొదలైంది. నా మొదటి సినిమా కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఆ తరువాత రెండు సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో కొంతమంది నాపై ఐరన్ లెగ్ ముద్రవేశారు. నన్ను పెట్టుకుంటే ఆ సినిమా ఆగిపోతుందనే ప్రచారం చేశారు.
అలాంటి ప్రచారం కారణంగా కొన్ని అవకాశాలు పోయాయి. ఐరన్ లెగ్ అనే విమర్శలు నా వరకూ వచ్చినప్పుడు నాకు చాలా బాధ కలిగేది. అయినా పట్టించుకోనట్టుగా నా పనిని నేను చేస్తూ వెళ్లాను. ఐరన్ లెగ్ అనే విమర్శల నుంచి నేను బయటపడటానికి దాదాపు మూడేళ్లు పట్టింది. నాకే కాదు .. కెరియర్ ను మొదలుపెట్టిన చాలా మంది కథానాయికలు ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారే. వాళ్లంతా కూడా నా మాదిరిగా బాధపడినవారే. నా పనితీరే నాకు సక్సెస్ ను తెచ్చిపెడుతుంది. ఆ సక్సెస్ మాత్రమే ఆ విమర్శలకు సమాధానం చెబుతుందని భావిస్తూ ముందుకు వెళ్లాను.
చివరికి నేను అనుకున్నదే జరిగింది. ఒక్కో సక్సెస్ పడుతూ ఉండటంతో, విమర్శలన్నీ చెదిరిపోయాయి. అవమానించిన వాళ్లంతా మళ్లీ కంటికి కనిపించలేదు" అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో కీర్తి సురేశ్ 'సర్కారువారి పాట' చేస్తోంది. మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అలాగే 'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెల్లి పాత్రలో ఆమె కనిపించనుంది. నాని హీరోగా చేస్తున్న 'దసరా' సినిమాలోను ఆమెనే హీరోయిన్. తమిళంలో ఆమె చేసిన 'సానికాయిధం' విడుదలకి ముస్తాబవుతోంది. చూస్తుంటే కీర్తి సురేశ్ కి ఈ ఏడాది వరుస హిట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.