నేను.. శైలజ చిత్రంలో రామ్ సరసన నటించి, తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఒకనాటి హీరోయిన్ మేనక కూతురే ఈమె. తండ్రి సురేష్ ప్రముఖ మళయాళ నిర్మాత. ముందునుంచే సినీ బ్యాగ్రౌండ్ లో పెరిగిన ఈమె.. మళయాళ మూవీ గీతాంజలితో తెరంగేట్రం చేసింది. తర్వాత కోలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో కనిపించాక.. ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. అయినా ఇష్టం నువ్వు అనే మూవీ ఈమెకు టాలీవుడ్ లో తొలి చిత్రం అయినా.. అది విడుదలకు నోచుకోలేదు. దీంతో ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నేను.. శైలజ.. పై బోలెడన్న ఆశలు పెట్టుకుంది.
- మొదటి మూవీ రిలీజ్ కాకపోయినా, ఈ ఆఫర్ ఎలా వచ్చింది ?
జ- అయినా ఇష్టం నువ్వు సినిమా చూసి కిశోర్ నన్ను అప్రోజ్ అయ్యారు. హీరోయిన్ కేరక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండడంతో ఓకే చెప్పాను.
- నేను.. శైలజ గురించి ?
జ- దర్శకుడు కథ చెప్పిన తీరు సూపర్బ్. కొంచెం డ్రామా ఉన్నా.. స్టోరీ రియలిస్టిక్ గా ఉంటుంది. ఇందులో తండ్రీ కూతురు సెంటిమెంట్ హైలైట్ గా నిలుస్తుంది.
- హీరో రామ్ గురించి ?
జ - రామ్ తో ఇంతకుముందు పరిచయం లేదు. మంచి యాక్టర్ అని మాత్రమే తెలుసు. కానీ మా అమ్మ - అక్కయ్య మాత్రం రామ్ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు. షూటింగ్ స్టార్ చేశాక చాలా ఎనర్జిటిక్ అని అర్ధమైంది. డ్యాన్సులు బాగా చేయడమే కాదు.. అసలు రామ్ ఎప్పుడూ ఒకచోట కూర్చోవడాన్ని నేను గమనించలేదు. ఓ సీన్ పూర్తి కాగానే.. వెంటనే వెళ్లి మానిటర్ లో చూసుకుంటాడు. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకునే మెంటాలిటీ.
- శైలజ ఎలా ఉంటుంది ?
జ - ఈ చిత్రంలో శైలజది ఇంట్రావర్ట్ కేరక్టర్. అయితే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న అమ్మాయన్న మాట. కానీ చిన్నతనం నుంచి ఫీలింగ్స్ ఎక్కువగా ఎక్స్ ప్రెస్ చేయలేదు.
- రామ్ తో డ్యాన్సుల్లో పోటీ పడాల్సి వచ్చిందా ?
జ - నేను శైలజలో.. నేను డ్యాన్సులు చేసే సన్నివేశాలు - పాటలు ఎక్కువగా లేవు. కాబట్టి పోటీ మాట రాలేదు. అయినా డ్యాన్సుల విషయంలో నేను అంత కరెక్ట్ కాదు.
- ఎక్స్ పోజింగ్ గురించి మీ ఉద్దేశ్యం ?
జ - స్లీవ్ లెస్ వేసుకుంటే చేతుల్ని, నీస్ వరకు వేసుకుంటే మోకాళ్ళ వరకు ఎక్స్ పోజింగ్ చేస్తున్నట్టే అర్థం. కానీ అది గ్లామర్ కాదు. గ్లామర్ వేరు, ఎక్స్ పోజింగ్ వేరు. మోడ్రన్ గా ఉంటానికి నేను సిద్ధమే.. జీన్స్ - టాప్స్ - షార్ట్స్ వేసుకుంటాను. అంతవరకూ నో అబ్జెక్షన్.
- ఈ సినిమాలో లిప్ లాక్స్ ?
జ - లేవు.
- స్రవంతి మూవీస్ తో చేయడం గురించి ?
జ- స్రవంతి బ్యానర్ లో పనిచేయడం అంటే.. లక్కీగా భావిస్తున్నాను. రవికిశోర్ గారు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ అంతే ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్. ఎవరి విషయంలో అయినా చాలా జాగ్రత్తలు తీసుకునే మనిషి.
- మీ డ్రీమ్ రోల్స్ ?
జ- క్వీన్ లో కంగనా రనౌత్ చేసిన తరహా పాత్రలంటే చాలా ఇష్టం.