సౌత్ ఇండియన్ కుర్ర హీరోయిన్ కీర్తి సురేష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అంతేగాక వరుస సినిమాలను కూడా విడుదలకు సిద్ధం చేస్తోంది. చేతినిండా సినిమాలు ఉన్న కీర్తి.. అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఇటు హీరోల సరసన నటిస్తుంది. తెలుగులో ఈ భామ నేను శైలజ - నేను లోకల్ - మహానటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. అమ్మడు అతికొద్ది కాలంలోనే తెలుగు కుర్రకారును తన బుట్టలో వేసుకుంది. ఇండస్ట్రీలో ఎలాంటి స్కిన్ షో గాని, గ్లామర్ పాత్రలు చేయకుండానే కీర్తి వరుస అవకాశాలు తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే హీరో నితిన్ సరసన రెండు సినిమాలు - సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట'.. సినిమాలతో పాటు 'గుడ్ లక్ సఖి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఇక ఈ విషయాలు పక్కన పెడితే కీర్తి మొదటి నుండి కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తుంది.
అయితే కీర్తి ఈ ఏడాది వేసవిలో మంచి ట్రీట్ ఇవ్వనుంది. ఎలా అంటే.. ఈ సమ్మర్ సీజన్ లో ఒకే రోజున కీర్తి నటించిన రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఒకటి తెలుగు సినిమా కాగా మరోటి మలయాళం మూవీ. తెలుగు యంగ్ హీరో నితిన్ సరసన కీర్తి నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ రంగ్ దే మూవీ. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా మార్చి 26న విడుదల కాబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఇక అదే రోజున కీర్తి నటించిన మలయాళ సినిమా 'మరక్కార్ అరబిక్కడలింటే సింహం'కూడా విడుదల కాబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి ఓ కీలక పాత్ర పోషించింది. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన ఈ హిస్టారికల్ ఎపిక్ వార్ డ్రామా.. మార్చ్ 26నే థియేటర్లోకి రానుంది. మరి అమ్మడు నటించిన ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను తేనున్నాయో చూడాలి.