ఫోటో స్టొరీ: మలగ నగరంలో మహానటి

Update: 2019-06-16 06:24 GMT
మలయాళం భామ కీర్తి సురేష్ 'నేను శైలజ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటన.. గ్లామర్ విషయంలో మంచి మార్కులు తెచ్చుకున్న కీర్తికి తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి.  అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' కీర్తికి భారీ ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత కీర్తి తన సినిమాల ఎంపిక విషయం ఆలోచనలో పడిపోయింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలలో నటిస్తోంది.  అయితే సినిమాల కంటే ఎక్కువగా ఈమధ్య హాట్ టాపిక్ అయింది మాత్రం కీర్తి సురేష్ మేకోవర్.

ఛోటా భీమ్ లో టున్ టున్ మౌసి అమ్మే లడ్డులా ముద్దుగా బొద్దుగా ఉండే కీర్తి కాస్తా సన్నటి గోదారి పూతరేకులా మారిపోయింది.  అసలే లడ్డూలను విపరీతంగా ప్రేమించే సమాజం మనది. అందుకే కొంతమంది ఎందుకు బక్కగా అయ్యావు అంటూ కసురుకుంటున్నారు.  విషయం ఏంటంటే అజయ్ దేవగణ్ నటించనున్న ఒక బయోపిక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట.  ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు 1953 నుండి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్  రూపొందుతోంది. 'బధాయి హో' ఫేం అమిత్ శర్మ దర్శకుడు. కీర్తి  స్లిమ్ మేకోవర్ ఈ బాలీవుడ్ చిత్రం కోసమే అనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కీర్తి తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. స్పెయిన్ దేశంలోని మలగ నగరంలో తీసుకున్న ఫోటో అది.  ఈ ఫోటోకు కీర్తి ఇచ్చిన క్యాప్షన్ 'సన్ కిస్డ్  సాటర్ డే #మలగ'.  ఫోటోలో వైట్ కలర్ బాత్ రోబ్ లో కీర్తి సురేష్ ఒక రెయిలింగ్ కు ఆనుకొని నిలబడింది. కళ్ళకు గాగుల్స్.. కాళ్ళకు ఆరెంజ్ కలర్ స్లిప్పర్స్.. లూజ్ హెయిర్ తో క్యాజువల్ గా పోజిచ్చింది. ఈ ఫోటోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. "చబ్బీగా ఉండే కీర్తినే బాగుంది".. "రకుల్ నుంచి ఇన్ స్పిరేషన్ తీసుకున్నావా".. "మోడరన్ గా మారిపోయావా?".. "ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోయవా" అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కీర్తి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే మలయాళంలో మోహన్ లాల్ సినిమా 'మరక్కార్: అరబికడలంటే సింహం' లో నటిస్తోంది.
Tags:    

Similar News