కీర్తి సురేష్‌ ఈసారైనా సంతృప్తి పర్చేనా..?

Update: 2018-11-06 01:30 GMT
తెలుగు - తమిళంలో ‘మహానటి’ చిత్రంతో కీర్తి సురేష్‌ మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రతిభ ఉన్న నటిగా కీర్తి సురేష్‌ కు మంచి పేరు తెచ్చి పెట్టిన ‘మహానటి’ పలు అవార్డులు రివార్డులు దక్కించుకుంటుంది. కాని మహానటి తర్వాత కీర్తి సురేష్‌ కు ఆశించిన స్థాయిలో మంచి పాత్రలు మాత్రం దక్కడం లేదు. తెలుగులో ‘మహానటి’ చిత్రం తర్వాత కీర్తి సురేష్‌ నటించలేదు. కాని తమిళ చిత్రం డబ్బింగ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్‌ తో కలిసి ‘పందెంకోడి 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్‌ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

విశాల్‌ సినిమా సక్సెస్‌ టాక్‌ ను దక్కించుకున్నా కూడా కీర్తి సురేష్‌ కు పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కక పోవడంతో ఆమెకు పేరు రాలేదు. పక్కా కమర్షియల్‌ - హీరో ఓరియంటెడ్‌ చిత్రాల్లో హీరోయిన్స్‌ కు పెద్దగా స్కోప్‌ ఉండదు. తాజాగా ‘సర్కార్‌’ చిత్రంతో కీర్తి సురేష్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం కూడా పక్కా కమర్షియల్‌ మూవీ కనుక కీర్తి సురేష్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండక పోవచ్చు అంటూ తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.

పందెం కోడి 2 చిత్రంలో మంచి స్కోప్‌ దక్కక పోవడంతో కీర్తి సురేష్‌ ఫ్యాన్స్‌ సర్కార్‌ లో అయినా మంచి పాత్రతో వస్తుందేమో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని విజయ్‌ మూవీలో హీరోయిన్‌ కు స్కోప్‌ ఉంటుందంటే అది అత్యాసే అవుతుంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మహానటి చిత్రంతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్‌ ఆ తర్వాత చిత్రాలతో ఆ ఇమేజ్‌ ను కాపాడుకోలేక పోతుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్‌ తరహాలోనే ఈమె కూడా సాదా సీదా హీరోయిన్‌ అయిపోతుందనిపిస్తోంది.

Tags:    

Similar News