కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతుంటే.. సినీ ప్రముఖులు మాత్రం పెళ్లి పీటలెక్కుతున్నారు! తాజాగా.. తమిళ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు ఓ ఇంటివాడయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడడంతో.. ఇదే గ్యాప్ లో పెళ్లి తంతు ముగించాడు. మహాలక్ష్మి అనే యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. చోలింగనల్లూరు లో వీరి వివాహం జరిగింది.
ఈ వేడుకకు కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఈ పెళ్లికి హీరోయిన్ కీర్తి సురేష్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ హాజరై సందడి చేశారు. వధూవరులతో వీరు దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విష్ణు పెళ్లి సందర్బంగా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విష్ణు పలు హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తమిళ్ స్టార్ విజయ్ నటించిన ‘అదిరింది’, ‘విజిల్’ సినిమాలకు ఆయనే సినిమాటోగ్రాఫర్. రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ చిత్రానికి కూడా ఈయనే పనిచేశారు.