చార్మీ బర్త్ డే లో కెల్విన్.. పూరీకి చూపించిన సిట్

Update: 2017-07-19 15:27 GMT
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారుల విచారణలో  పూరీ జగన్నాథ్ ఏ విషయం కూడా దాచలేకపోతున్నాడట. దాచి పెట్టాలనకుంటున్నా సిట్ అధికారులు అందుకు సంబంధించిన ఆధారాలు చూపడంతో అంగీకరించకతప్పడం లేదట. కెల్విన్ తో పరిచయం లేదని బుకాయించే ప్రయత్నం చేసినా సాగలేదని సమాచారం. చార్మి పుట్టినరోజు వేడుకల్లో కెల్విన్ పాల్గొన్న విషయమై పూరీని ప్రశ్నించినట్టు, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా అధికారులు చూపించినట్టు తెలుస్తోంది. కాగా, కెల్విన్ నుంచి పూరీ డ్రగ్స్ తీసుకున్నట్టు నలుగురు సభ్యుల సిట్ బృందం నిర్ధారణకు వచ్చారని సమాచారం.
    
తనకు డ్రగ్స్ అలవాటు లేదని, ఓ ఈ వెంట్ సందర్భంగా పబ్‌లో రెండు మూడు సార్లు కెల్విన్‌ను కలిశానని, అంతకు మించి అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడిని తర్వాత ఎప్పుడూ కలవలేదని విచారణలో పూరీ చెప్పినట్లు తెలుస్తోంది.
    
మరోవైపు పూరీ విచారణ సాగుతుండగానే సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్ చల్ చేయడం మొదలైంది. ఛార్మీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో పూరీతోపాటు కెల్విన్ కూడా ఉన్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఆ కార్యక్రమంలోనే ఛార్మీ పుట్టినరోజు వేడుకను కూడా నిర్వహించారు.  సిట్ అధికారులు కూడా పూరీకి ఈ ఫొటోతో పాటు మరికొన్ని ఫొటోలు చూపించినట్లు సమాచారం.
Tags:    

Similar News