'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ కేతిక శర్మ. తొలి చిత్రంలోనే లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ తోపాటుగా రెచ్చిపోయి రొమాన్స్ చేసి యువ హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అమ్మడి అందాల ఆరబోతకు ఫలితం దక్కింది. వరుసగా రెండు చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది.
నాగ శౌర్య హీరోగా నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా చేసింది. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాకపోతే కేతిక అందాలు యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఢిల్లీ బ్యూటీ మూడో సినిమా మీద అందరి దృష్టి పడింది.
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూడో సినిమా ''రంగంరంగ వైభవంగా'' చిత్రంలో కేతిక హీరోయిన్ గా నటిస్తోంది. గిరీశాయ దర్శకత్వంలో న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ని ఆవిష్కరించారు.
బటర్ ఫ్లై కిస్ గురించి తెలుసా అంటూ వచ్చిన 'రంగంరంగ వైభవంగా' టైటిల్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మలు కలిసి ఉన్న ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ ట్రెడిషినల్ లుక్ లో దర్శనమిచ్చారు.
అయితే కేతిక ట్రెడిషినల్ లుక్ కి నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సినిమాల్లో పొట్టి పొట్టి మోడ్రన్ డ్రెసుల్లో కనిపించిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా సాంప్రదాయకంగా హాఫ్ సారీలో కనిపించడంతో కొందరు నిబ్బాలు చిత్ర బృందాన్ని ట్రోల్ చేస్తున్నారు. తమ
ఇకపోతే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వంటి పెద్ద బ్యానర్ లో రూపొందుతున్న 'రంగంరంగ వైభవంగా' సినిమా కేతిక శర్మ కెరీర్ కు బాగా ఉపయోగడుతుందని అందరూ నమ్ముతున్నారు. మెగా మేనల్లుడితో సినిమా సక్సెస్ అయితే అదే కాంపౌండ్ లో అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.