సలార్ రీమేక్ కాదు.. కొత్త కథ: కేజీఎఫ్ డైరెక్టర్ క్లారిటీ

Update: 2021-01-21 16:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్ అంటూ రెడీ అవుతున్నాడు. రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ముగించుకొని ఇటీవల సలార్ బృందంలో జాయిన్ అయ్యాడు ప్రభాస్. అయితే ప్రభాస్ సినిమాల గురించి రోజూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. డార్లింగ్ ప్రభాస్ ను ఎన్నడూ చూడని మాస్ లుక్కులో చూపించనున్నాడు. సలార్ అని ముందే టైటిల్ ప్రకటించడంతో ఈ సినిమా పై అంచనాలు మాత్రం ఓ రేంజిలో నెలకొన్నాయి. సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా పూజా కార్యక్రమం ఫినిష్ చేశారు మేకర్స్. అయితే సలార్ సినిమాలో పాత్రకోసం డార్లింగ్ కండలు తిరిగిన దేహంతో కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పోస్టర్ ద్వారా ప్రభాస్ ఎలాంటి మాస్ లుక్కులో దర్శనమిచ్చాడో తెలిసిందే.

అయితే మాఫియా నేపథ్యంలో ఇదివరకు చూపించని వయోలెన్స్, యాక్షన్ చూపిస్తారని టాక్. అంతేగాక ప్రశాంత్ - ప్రభాస్ ఈ సలార్ మూవీని కేవలం నాలుగు నెలలలో పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ మూవీ రీమేక్ అంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్. 'ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదని, అలాగే కేజీఎఫ్ సినిమా స్క్రిప్ట్ రాసే సమయంలో ఈ స్టోరీ కూడా రాసుకున్నామని' చెప్పాడు. ఇక డార్లింగ్ నే హీరోగా ఎందుకు తీసుకున్నాడో ఇదివరకు 'ఈ సినిమాలో హీరో అమాయకంగా ఉండాలి. ఆ తర్వాత వయోలెంట్ గా మారతాడు. అందుకోసమే ప్రభాస్ ను సెలెక్ట్ చేసుకున్నాం' అని చెప్పాడు. ఇప్పటికే నటినటుల ఎంపిక అయిపోయిందట. ఇక త్వరలోనే హీరోయిన్ ఎవరినేది అధికారికంగా ప్రకటిస్తారట. అయితే హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దసరా వరకు కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


Tags:    

Similar News