మాఫియా కథాంశాల్లో మరో లెవల్ అనేలా తెరకెక్కించారు కేజీఎఫ్ చిత్రాన్ని. బంగారు గనుల మాఫియా కాన్సెప్టును ఎంచుకుని తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడు! అన్న థీమ్ ని ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన తీరు సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు అంతకుమించి అనేలా సీక్వెల్ ప్రీక్వెల్ కాని కథతో కేజీఎఫ్ 2ని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. తాజాగా రిలీజైన ట్రైలర్ వీక్షణలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కేవలం 24 గంటల్లోనే కేజీఎఫ్ 2 ట్రైలర్ 11 కోట్ల వీక్షణలను అందుకోవడం ఒక సంచలనం అని చెప్పాలి. అంటే 109 మిలియన్ల వీక్షణలు అంటూ కేజీఎఫ్2 టీమ్ ప్రకటించింది.
రాకీ డోంట్ లైక్ ఇట్.. హి అవాయిడ్స్ .. బట్ రికార్డ్స్ లైక్ రాకీ! హీ కాంట్ అవాయిడ్ ఇట్... అంటూ ఒక డైలాగ్ తో ఆనందం వ్యక్తం చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ ఆద్యంతం మాసిజం యాక్షన్ యష్ స్టైలిష్ యాటిట్యూడ్ ప్రతిదీ ఆసక్తిని పెంచాయి. 109 మిలియన్ల వ్యూస్ లో కన్నడలో వీక్షణలు 18 మిలియన్లు.. తెలుగులో అంతకుమించి అనేలా 20 మిలియన్ల మంది ట్రైలర్ చూశారు. హిందీలో అయితే ఏకంగా 51 మిలియన్ల మంది కేజీఎఫ్ 2 ట్రైలర్ ని వీక్షించారు. మలయాళంలో 8 మిలియన్ల మంది వీక్షించారు.
ఇది ఏ రాష్ట్రం నుంచి ఎంత వసూల్ చేస్తుంది? అన్నదానికి ముందే ఇచ్చిన హింట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా కన్నడ కంటే కూడా తెలుగులోనూ బంపర్ కలెక్షన్లు సాధిస్తుందని అర్థమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్ని మించి ఉత్తరాది నుంచి ఏకంగా డబుల్ ట్రిపుల్ కలెక్షన్లను తేవడం గ్యారెంటీ అన్న ప్రామిస్ కనిపిస్తోంది. ట్రైలర్ వీక్షించిన వారంతా థియేటర్లకు వస్తే చాలు. బంపర్ కలెక్షన్లు పాజిబుల్ అని చెప్పొచ్చు.
నిజానికి కేజీఎఫ్ రిలీజ్ సమయంలో ఇంత బజ్ లేదు. ఇంత హంగామా లేనేలేదు. కేజీఎఫ్ సైలెంట్ గా వచ్చి పాన్ ఇండియా రేంజు హిట్ కొట్టింది. ఇప్పుడు భారీ అంచనాలతో తెరకెక్కిన సీక్వెల్ అంతకు మించి అనేలా బంపర్ హిట్ కొట్టి తీరుతుందని అంచనా ఉంది. ముఖ్యంగా కన్నడ కంటే కేజీఎఫ్ 2కి తెలుగులోనే లవర్స్ ఎక్కువ ఉన్నారని కూడా అర్థమవుతోంది.