బిగ్ బాస్ 8 : విష్ణుకి శ్రీముఖి సలహాలు.. గేమ్ మార్చేసే ఛాన్స్..!
బిగ్ బాస్ సీజన్ 8 లో శుక్రవారం ఎపిసోడ్ లో సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి ఎంట్రీ ఆడియన్స్ ను ఖుషి చేసింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో శుక్రవారం ఎపిసోడ్ లో సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి ఎంట్రీ ఆడియన్స్ ను ఖుషి చేసింది. శ్రీముఖి రాకతో హౌస్ అంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఐతే శ్రీముఖి అందరి ఆట గురించి ఒక్కొక్కరికి సలహాలు ఇవ్వగా ఆమెకు చాలా బాగా క్లోజ్ అయిన విష్ణు ప్రియకు చిన్నపాటి క్లాస్ పీకింది. శ్రీముఖి విష్ణు ప్రియ ఇద్దరు బయట చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరు కలిసి చాలా ప్రాజెక్టులు చేశారు. విష్ణు ప్రియ గురించి శ్రీముఖి అంతా తెలుసు. ఐతే శ్రీముఖి హౌస్ లో విష్ణు ప్రియ ఆట గురించి ఆమెకు క్లాస్ పీకింది.
మొదటి రెండు మూడు వారాలు చూసి టైటిల్ గెలుస్తుంది అనిపించింది కానీ మధ్యలో సైడ్ ట్రాక్ వెళ్లావని చెప్పింది. అంతేకాదు ఒకరి మీదే అటెన్షన్ ఉండటం అనేది కరెక్ట్ కాదని అది వేరేలా వెళ్తుందని శ్రీముఖి చెప్పింది. అంతేకాదు అసలు అవతల మనిషి నిన్ను పట్టించుకోనప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చింది శ్రీముఖి. ఐతే శ్రీముఖి ఇచ్చిన హింట్స్ ని విష్ణు ప్రియ సీరియస్ గానే తీసుకున్నట్టు అనిపిస్తుంది.
మరోపక్క పృధ్వితో కూడా ఒక అమ్మాయి వచ్చిన అందరు మీ రిలేషన్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఆమెకు సపోర్ట్ గా నిలబడట్లేదని అడిగింది శ్రీముఖి. ఐతే తనకు ఆల్రెడీ చెప్పానని అయినా సరే ఆమె వెంట పడుతుందని పృధ్వి చెప్పాడు. ఐతే కొద్దిసేపు మాట్లాడుతూ ఉండటం.. మళ్లీ క్లోజ్ అవ్వడం ఇది వేరేలా వెళ్తుందని అన్నది శ్రీముఖి. ఇక శ్రీముఖి హౌస్ లో ఉన్నప్పుడే పృధ్విని పిలిచి ఇక మీదట నీ ఆట నువ్వు ఆడుకో అన్నది విష్ణు ప్రియ.
ఆల్రెడీ హౌస్ లోకి వచ్చిన గెస్టులంతా కూడా ఇదే విషయాన్ని విష్ణు ప్రియకు చెబుతున్నా ఆమె అవి నా ఫీలింగ్స్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ శ్రీముఖి వచ్చి బయట ఏం జరుగుతుంది. ఇది ఎలా పోట్రే అవుతుంది అన్నది క్లారిటీ ఇవ్వడంతో విష్ణు ప్రియ జాగ్రత్త పడాలని అనుకుంది. మరి రాబోయే రెండు వారాలైనా విష్ణు ప్రియ సోలో గేమ్ ఆడుతుందేమో చూడాలి. ఫ్రెండ్ అంటూనే విష్ణు ప్రియ పృధ్వి మీద చూపెడుతున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఆడియన్స్ కు బోర్ కొట్టేసింది. అందుకే విష్ణు ప్రియకు శ్రీముఖి వెళ్లి సరైన సలహాలు ఇచ్చి ఆమెను దారిలో పెట్టే ప్రయత్నం చేసింది.