బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆ భామ తర్వాత రామ్ చరణ్ సరసన నటించింది. ఇక బాలీవుడ్ ఫిల్మ్స్‌లోనూ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసింది. కాగా, తాజాగా తాను నటి కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని అనే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన 'అర్జున్‌రెడ్డి'సినమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను బాలీవుడ్లో ఈ డైరెక్టరే 'కబీర్ సింగ్'గా రీమేక్ చేశారు. ఇందులో షాహిద్ ఖాన్‌కు జోడీగా కియారా నటించి మంచి మార్కులు కొట్టేసింది. కాగా ఈ భామ సిద్దార్థ్ మల్హోత్ర సరసన నటించిన 'షేర్షా' మూవీ ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ అద్భుతమని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది కియారా. తను నటి కాకపోయి ఉంటే మానసిక నిపుణురాలు అయేదాన్నని తెలిపింది. చైల్డ్ సైకాలజీ స్టడీ చేసేదాన్నని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ 'భూల్ బాలయ్య 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లేలె' చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది. ఇకపోతే ఈ భామ రామ్ చరణ్ తేజ్ సరసన మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన ఫేమస్ డైరెక్టర్ శంకర్ - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న చిత్రంలో చెర్రీకి జోడీగా కియార నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కియారా అద్వానీ 'ఫగ్లీ' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ 'ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరి' ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇక బోల్డ్ కంటెంట్‌లో నటించేందుకు ఆసక్తి కనబరిచి తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది ఈ భామ. 'లస్ట్ స్టోరీస్'లో కియారా అద్వానీ యాక్టింగ్ చూసి విమర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక 'కబీర్ సింగ్' సినిమాలో 'ప్రీతి సిక్క'గా 'గుడ్ న్యూస్' చిత్రంలో 'మొనిక'గా ఏ పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పిస్తోంది ఈ భామ.