వ్యాక్సిన్ ప్ర‌యోగాల‌తో మ‌నుషుల్ని చంపేస్తారు!

Update: 2021-01-24 16:17 GMT
క‌రోనా క్రైసిస్ కాలంలో రిలీజైన ప‌లు చిత్రాలు ప్రేక్ష‌కుల్ని నిశ్చేష్టుల‌నే చేశాయి. నిజానికి క‌రోనా రాక మునుపే ఈ వైర‌స్ పై హాలీవుడ్ లో సినిమా తీశారు. ఎక్క‌డో దీవుల్లో చ‌నిపోయిన జంతు క‌లేబ‌రాల నుంచి వైర‌స్ నెమ్మ‌దిగా విమానంలో ప్ర‌యాణించిన వ్య‌క్తి కి చేరుతుంది. అక్క‌డినుంచి విమానాశ్ర‌యంలో ప్ర‌యాణీకుల‌కు సోకుతుంది. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి ప్ర‌పంచ దేశాల‌కు విస్త‌రిస్తుంది. అనంత‌రం దానిని కంట్రోల్ చేసేందుకు మాన‌వ ప్ర‌య‌త్నాలేమిట‌న్న కాన్సెప్టుతో తెర‌కెక్కిన `పాండ‌మిక్` చిత్రం ఆద్యంతం ఎంతో థ్రిల్ కి గురి చేస్తుంది.

అప్ప‌ట్లో నిఫా వైర‌స్ నేప‌థ్యంలో కేర‌ళ గ‌జ‌గ‌జ ఒణికింది. ఆ రియ‌ల్ అనుభ‌వాన్ని క‌ళ్ల‌కు గ‌డుతూ రూపొందించిన మ‌ల‌యాళ చిత్రం `వైర‌స్` ఆద్యంతం థ్రిల్ క‌లిగించింది. ఆ త‌ర్వాత ఆర్జీవీ క‌రోనా వైరస్ అంటూ హంగామా చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే పాండ‌మిక్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మాన‌వాళి చేసిన ప్ర‌యోగాల‌పై ఎలాంటి సినిమా రాలేదు. ల్యాబుల్లో టెస్టులు చేసి వ్యాక్సిన్ల‌ను రూపొందించే సైంటిస్టుల ప్ర‌యోగాల‌పైనా.. వ్యాక్సిన్ల ప్ర‌యోగాల్లో చ‌నిపోయే జీవులపైనా.. ఏ సినిమా లేదు. నిజానికి ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో వ్యాక్సిన్ ప్ర‌యోగాల్ని మ‌నిషిపైనే చేసిన‌ప్పుడు చాలామంది చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. అయితే ఈ త‌ర‌హా థ్రిల్ల‌ర్ బేస్డ్ క‌థాంశంతో ప్ర‌స్తుతం ఓ సినిమా వ‌స్తోంది. అదే A. ఇటీవ‌లి కాలంలో వ్యాక్సిన్ విక‌టించి వ‌లంటీర్ మృతి అంటూ వార్త‌లు క‌ల్లోలం రేపాయి. కానీ వ్యాక్సిన్ ప్ర‌యోగాల స్థాయి భార‌త‌దేశంలో ఎలా ఉంటుందో చూపించే సినిమా ఇద‌న్న ప్ర‌చారం సాగుతోంది.

ఎంచుకున్న కాన్సెప్ట్ బ‌ర్నింగ్ టాపిక్ పై కాబ‌ట్టి ఆస‌క్తిక‌రం. పివిఆర్ పిక్చర్స్ ద్వారా ఫిబ్రవరి 26న భారీ గా విడుదలవుతున్న `A`లో
నితిన్ ప్రసన్న - ప్రీతి అస్రాని తారాగ‌ణం. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించారు. సెన్సార్ యుఏ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు ద‌క్కాయ‌ని స‌మాచారం.

నిర్మాత గీతా మిన్సాల మాట్లాడుతూ..' యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి 'A' చిత్రాన్ని బడ్జెట్ కి వెనకాడకుండా నిర్మించాం. టెక్నికల్ గా, విజువల్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ మంచి సినిమా కోసం తమవంతు సహకారం అందించారు. టీజర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. అంచనాలకు మించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా యుగంధర్ ముని ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అలాగే పివిఆర్ లాంటి బిగ్ బ్యానర్ ద్వారా మా చిత్రం ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతుంది.. అన్నారు. థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో స‌రికొత్త అనుభూతిని క‌లిగించే చిత్ర‌మిద‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News