ఆ హీరోయిన్ ప్రముఖ క్రికెటర్ తో పెళ్లిపీటలు ఎక్కనుందా...?

Update: 2020-05-19 11:10 GMT
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల పెళ్లిళ్లు సినీ అభిమానులకు ఉత్సాహాన్నిస్తున్నాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండస్ట్రీలో పెళ్లీడు కొచ్చిన హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు చేసుకోడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే వారిలో కొంతమంది పెళ్లి చేసుకోగా మరికొందరు ఈ ఏడాది చివర్లో పెళ్లి భాజా మోగించనున్నారు. యంగ్ హీరో నిఖిల్ ఇప్పటికే ఒక ఇంటివాడు అయ్యాడు. ఇక నితిన్ ఎంగేజ్మెంట్ చేసుకొని పరిస్థితులు అనుకూలిస్తే చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా కూడా తన ప్రేయసిని పరిచయం చేసాడు. వారి పెళ్ళికి ఇంట్లో పెద్దలు ఓకే అనడంతో ఈ ఏడాదిలోనే పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కోలీవుడ్ ఒకప్పటి హీరో కూతురు ప్రస్తుత హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతోంది అనే వార్త మీడియాలో వచ్చింది. ఆ హీరోయిన్ పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని.. అంతా సవ్యంగా జరిగితే పెళ్లి లాక్ డౌన్ తర్వాత జరిగే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఆ హీరోయిన్ పెళ్లి వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేసాయి. దానికి తగ్గట్టే వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగేవాళ్లు. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ.. మా మధ్య అలాంటి బంధమే లేదని సదరు హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా ఆ హీరో వేరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఆమెతో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాడు. దాంతో వారిద్దరి మధ్య అఫైర్‌ వార్తలకు పుల్‌ స్టాప్ పడింది. అయితే గత కొద్ది రోజులుగా సింగిల్ గా ఉంటూ వస్తున్నా హీరోయిన్ ఇటీవల ప్రేమలో పడిందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అంతేకాకుండా ఆమె ప్రియుడు ఇండియన్ క్రికెట్‌ కు సంబంధించిన వ్యక్తి అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం చాలా పకడ్బందీగా బయటకు రాకుండా హీరోయిన్ కుటుంబ సభ్యులు మైంటైన్ చేస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా పీకల్లోతు ప్రేమలో వారిద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. తమ ప్రతిపాదనకు ఇరు కుటుంబాల నుంచి అంగీకారం లభించినట్టు సమాచారం. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం చాలా సీక్రెట్‌ గా పెట్టడం అనేక సందేహాలకు తావిస్తుంది. ఈ రెండు నెలల్లో ఇరు కుటుంబాలు మధ్య అవగాహన కలిగి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకొన్నారని.. లాక్‌ డౌన్ ముగిసిన తర్వాత పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వార్తలపై ఆ హీరోయిన్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఆమె సన్నిహితులు మాత్రం 'ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదని.. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా కెరీర్‌ పైనే ఉందని.. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరోయిన్ పెళ్లి విషయంపై చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారమైతే ఉంది. రాబోయే రోజుల్లో ఈ వార్తలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News