కోన వెంకట్ కొత్త ట్విస్టిచ్చాడు. శ్రీనువైట్లతో కలిసిపోతున్నా అని చెప్పుకొచ్చాడు. ఇప్పటిదాకా చోటు చేసుకొన్న వివాదాలకి స్వస్తి చెప్పి మునుపటిలాగా శ్రీనువైట్లతో కలిసిమెలసి పనిచేయాలనుకొంటున్నానని ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశాడు. బాద్ షా తర్వాత శ్రీనువైట్లకీ - కోనకీ మధ్య చెడిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇద్దరూ వేరు కుంపట్లు పెట్టుకొని సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే బ్రూస్ లీ సినిమా సమయంలో రామ్ చరణ్ చొరవ వల్ల ఆ ఇద్దరూ మళ్లీ కలుసుకొన్నారు. అయితే ఇటీవలే విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ శ్రీనువైట్లపై విమర్శలు ఎక్కుపెట్టాడు కోన. తాను రాసిచ్చిన సన్నివేశాలు శ్రీనువైట్ల వాడుకోకపోవడంతోనే బ్రూస్ లీ ఫలితం అలా వచ్చిందని బహిరంగంగా వ్యాఖ్యానించాడు. దీంతో శ్రీనువైట్ల - కోనకీ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇక వీళ్లిద్దరూ ఎప్పటికీ కలిసి పనిచేయలేరన్న అభిప్రాయాలు పరిశ్రమలో వ్యక్తమయ్యాయి.
అయితే కోన వెంకట్ దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన శంకరాభరణం కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి పరాజయాన్ని చవిచూసింది. దీంతో అందరి వేళ్లు కోన వెంకట్ పైకి మళ్లాయి. అందుకే కోననే ఓ మెట్టు దిగాడు. ఎవ్వరు చూసినా ఆ వివాదాన్నే ప్రస్తావిస్తున్నారని, ఇదొక డైలీ సీరియల్ లా మారిందని.. అందుకే అన్నీ కట్టిపెట్టి కలిసిమెలసి పనిచేయాలనుకొంటున్నట్టు స్పష్టం చేశాడు కోన. ఇదేదో ముందే చేసుండొచ్చు కదా కోనా...అంటున్నారు పరిశ్రమ జనాలు.