''ఈ సంక్రాంతికి తమ ల్యాండ్ మార్క్ ఫిలింస్ తో ఎంటర్టయిన్ చేయడానికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు. #Jan11Khaidi #Jan12GPSK ట్రెండింగ్ చేసి.. వారికి స్వాగతం పలుకుదాం'' అంటూ ట్వీటేశాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే వెబ్ మీడియాలో రచ్చ చేస్తున్న కొన్ని రూమర్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేయడానికి క్రిష్ వేసిన ట్వీట్ ఉపయోగపడింది.
నిజానికి ఈరోజు రామ్ చరణ్ అఫీషియల్ గా జనవరి 11న ఖైదీ నెం 150 సినిమా రిలీజ్ అవుతోందని.. 12న బాలయ్య వస్తున్నారు కాబట్టి.. తాము ఒక రోజు ముందు వస్తున్నామని ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన వచ్చిన వెంటనే.. అసలు బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను కూడా 11నే తేవాలని అంటున్నారని వార్తలు వచ్చేశాయి. నిజానికి అలా ఒకటే రోజును సినిమా రిలీజ్ చేస్తే.. ఫ్యాన్స్ తాలూకు ఈగో శాటిస్ఫై అవుతుందేమో కాని.. ప్రొడ్యూసర్లకు మాత్రం దెబ్బే పడుతుంది. బయ్యర్లకు కూడా కష్టమే. కాని ఇక్కడ మాత్రం బయ్యర్లే ప్రీ-పోన్ చేయమంటున్నారు అంటూ రూమర్లు వినిపించారు. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్ కు క్రిష్ పై ట్వీటుతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
ఏదేమైనా కూడా.. పోటీ వాతవరణం ఆరోగ్యవంతంగా ఉంటేనే బెటర్. ప్రతీ దానికి అభిమానులు ఇలా అభిమానం పేరుతో రచ్చ చేస్తే మాత్రం అందరికీ నష్టమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/