ఆనంద్ చూసి కృష్ణవంశీ జాలి పడ్డాడట

Update: 2016-11-23 07:30 GMT
సెన్సేషన్స్ సృష్టించడమే కాదు.. టాలీవుడ్ కి ఓ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ని అందించిన మూవీ శేఖర్ కమ్ముల. ప్రతీ ఫ్రేమ్ ని కొత్తగా మలచడంలో సక్సెస్ అయ్యి.. ప్రేక్షకులను కొత్త అనుభూతులను పంచిన ఈ చిత్రంతో.. తెలుగు సినీ పరిశ్రమకు శేఖర్ కమ్ముల మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు.

అయితే.. రిలీజ్ కి ముందు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి చూపించాడట. 'ఇదేం సినిమా' అని అనేశాడట కృష్ణ వంశీ. అంతే కాదు.. ఇంటర్వెల్ వరకూ చూసి 'అయిపోయిందా' అని కూడా అన్నాడట. అలాగని ఇదేమీ తనను అవమానించడం కాదని.. 'ఇలాంటివి ఆడవ్ బాబూ.. జాగ్రత్త' అని చెప్పడం అని చెప్పాడు శేఖర్ కమ్ముల. అంతేకాదు.. కృష్ణవంశీతో కలిసి సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఆనంద్ చూశారని.. ఆయన కూడా దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారని చెప్పడం విశేషం.

అసలు కృష్ణవంశీకి ఆనంద్ ని చూపించాల్సిన అవసరం ఏంటి అని అడిగితే.. 'అసలు ఆనంద్ మూవీని ఎంతో మందికి చూపించా.. తెలిసినా.. తెలియకున్నా.. కనిపించిన ప్రతీ ఒక్కరికీ చూపించా' అంటూ నవ్వేశాడు శేఖర్ కమ్ముల. అప్పటివరకూ ఉన్న ఫ్రేమ్స్.. సీన్స్ లాంటివి లేకుండా.. ఎంతో డిఫరెంట్ గా చేసిన ప్రయత్నం కావడంతో.. అప్పటికి ఎవరికీ ఈ ఆనంద్ ఎక్కేదికాదన్నది ఈ దర్శకుడు మాట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News