ప్రభాస్ కథానాయకుడిగా 'రాధేశ్యామ్' సినిమా రూపొందింది. టి సిరీస్ - యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది విదేశీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ .. అనుభూతి ప్రధానమైన కథ. అందువల్లనే అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమాను దృశ్యకావ్యంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు.
బలమైన కథాకథనాలతో పాటు గ్రాఫిక్స్ కి సమానమైన ప్రాధాన్యతనిచ్చారు. ఆ విషయం పోస్టర్స్ దగ్గర నుంచి తెలిసిపోతూనే ఉంది. జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరింత ప్రత్యేకతను తీరుసుకురావడం ఖాయమనిపిస్తోంది.
పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ తేదీ కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతూ ఉండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతూ వెళుతున్నారు.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'ఈ రాతలే ..' అనే లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. అందంగా .. ఆహ్లాదంగా ఈ పాట నడిచింది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ పాటను గురించి ప్రస్తావించారు.
"ప్రభాస్ సినిమాకి పాట రాసే అవకాశం రావడం నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం. 'ఈ రాతలే ..' పాట రాసే అవకాశం నాకు లభించడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాట వింటున్నప్పుడు సాహిత్యం అంత తేలికగా అర్థం కావడం లేదే అనిపిస్తుంది.
కానీ సినిమా చూస్తున్నప్పుడు ఈ పాట ఎంతో అర్థవంతంగా అనిపిస్తుంది. సాహిత్యం పరంగా అప్పుడు ఈ పాట ప్రతి ఒక్కరికీ దగ్గరవుతుంది. నిజానికి ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ పాటను కాస్త శ్రద్ధగా వింటే కథ ఏమిటనేది అర్థమైపోతుంది.
ఈ సినిమా కథ గురించి ఎవరికి తోచినట్టుగా వారు ఊచుకుంటున్నారు. పోస్టర్స్ ను చూసి కథ ఫలానా దారిలో వెళుతుందని అనుకుంటున్నారు. పునర్జన్మలకి సంబంధించిన కథ అని కొందరు .. టైమ్ మిషన్ కి సంబంధించిన కథ అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
సినిమా విడుదలయ్యేవరకూ ఎవరి ఊహకు వాళ్లను వదిలియడమే. అలాంటివారు నేను రాసిన 'ఈ రాతలే ..' అనే పాట వింటే కథ ఏమిటనేది అర్థమైపోతుంది. ఒక పాట ద్వారా సినిమా కథను చెప్పే అవకాశం నాకు కలగడం అదృష్టంగానే భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.