ప్రభాస్ హీరోగా రొమాంటిక్ సినిమా

Update: 2016-01-19 13:30 GMT
ప్రభాస్ పేరెత్తగానే అభిమానులకు అతడి భారీ విగ్రహమే గుర్తుకొస్తుంది. అతడు చేసిన యాక్షన్ సినిమాలే కళ్ల ముందు కదలాడుతాయి. కొన్ని సినిమాల్లో రొమాన్స్ కూడా పండించినప్పటికీ.. ప్రభాస్ అంటే యాక్షన్ కే ఫేమస్. అందులోనూ బాహుబలి లాంటి మెగా యాక్షన్ ఫాంటసీ మూవీలో నటించాక ప్రభాస్ రొమాంటిక్ సినిమాల్లో నటిస్తాడనే ఊహే జనాల తలపుల్లోకి రాదు. కానీ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మాత్రం అబ్బాయితో రొమాన్స్ పండిస్తా అంటున్నాడు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ తమ ‘గోపీకృష్ణ మూవీస్’ బేనర్లోనే నటిస్తాడని.. ఆ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని వెల్లడించారు కృష్ణంరాజు.

ఐతే ప్రభాస్ ఇప్పుడు రొమాన్స్ చేస్తే చూస్తారా అని కృష్ణం రాజును అడిగితే.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘నేను యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుని.. రెబల్ స్టార్ అని జనాల నుంచి బిరుదు అందుకున్నాక చేసిన సినిమా అమరదీపం. అందులో ఒక్క ఫైట్ కూడా ఉండదు. కానీ జనాలు ఆదరించారు. నా ఇమేజ్ ప్రకారం చూస్తే నేను భక్త కన్నప్ప సినిమా చేస్తానని కూడా ఎవ్వరూ అనుకోలేదు. కానీ చేశాను. దాన్నీ ఆదరించారు. అలాగే ప్రభాస్ రొమాన్స్ చేసినా చూస్తారు. ఐతే ఇందులో యాక్షన్ కు ఏమాత్రం ఢోకా ఉండదు’’ అన్నారాయన. ప్రభాస్ తో ‘ఒక్క అడుగు’ అనే సినిమా తీయాలనుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన కృష్ణం రాజు.. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తనే తీస్తారేమో చూడాలి.
Tags:    

Similar News