స్విస్ అందాల్లో సిస్ట‌ర్స్ కేరింత‌లు

Update: 2019-12-18 07:27 GMT
స్విస్ అందాల న‌డుమ విహారం అంటే భూత‌ల స్వ‌ర్గం లో విహ‌రించిన‌ట్టే. అయితే ఇది అత్యంత‌ ఖ‌రీదైన ప్ర‌యాణం. ధ‌న‌వంతులు.. సెల‌బ్రిటీల‌కు హాలీడే స్పాట్ స్విట్జ‌ర్లాండ్. అంద‌మైన మంచు ఐస్‌ వాతావ‌ర‌ణం. ఆ మంచు కొండ‌ల్లో అంద‌మైన గుడారాలు... హిల్స్ ఏరియా వ‌దిలేస్తే అంద‌మైన పూల‌వ‌నాలు..  ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అందుకే స్విస్ ని లైఫ్ టైమ్ లో విజిట్ చేడ‌ని సెల‌బ్రిటీ ఉండ‌రు. బాలీవుడ్  నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ ప‌లువురు సెల‌బ్రిటీలు సెల‌వులు దొరికాయంటే రెక్క‌లు క‌ట్టుకుని స్విస్ లో వాలిపోతారు. టాలీవుడ్ సెల‌బ్రిటీ ల‌కు ఎంతో ఇష్ట‌మైన హాలీడే  స్పాట్ కూడా అది. వెంక‌టేష్- మ‌హేష్ - రామ్ చ‌ర‌ణ్  అమితంగా ఇష్ట‌ప‌డే స్పాట్ అది. తాజాగా స్విస్ అందాల్ని బాలీవుడ్ సిస్ట‌ర్స్ కృతి స‌న‌న్.. నూపుర్ స‌న‌న్ లు చుట్టేస్తున్నారు. త‌మ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని అక్కా చెల్లెళ్లిద్ద‌రు ఇలా స్విట్జర్లాండ్ లో షికార్లు చేస్తున్నారు.

ఆ ప్రాంతంలో బాగా ఫేమ‌స్ అయిన‌ బ‌ర్గెన్ స్టార్ రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా కెమెరాకి దొరికారు. ల్యుసెర్న్.. చాపెల్ బ్రిడ్జ్ త‌దిత‌ర ప్రాంతాల‌ను చూసి చిన్న పిల్ల‌ల్లా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు తాజాగా లీక‌య్యాయి. ఈ ఫోటోలు నెటిజ‌నుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక కృతి స‌న‌న్ వ‌న్ చిత్రంతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితానివ్వ‌లేదు. ఆ త‌ర్వాత నాగ చైత‌న్య‌తో మ‌రో సినిమా చేసింది. ఆ సినిమా నిరాశ‌నే మిగిల్చింది.

దీంతో లాభం  లేద‌నుకున్న అమ్మ‌డు ముంబై ప‌రిశ్ర‌మ‌ కు వెళ్లి పోయింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. టాలీవుడ్ లో త‌డ‌బ‌డినా బాలీవుడ్ లో ఆ త‌ప్ప‌ట‌డుగులు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. ఇక నూపుర్ స‌న‌న్ అక్క‌లా పెద్ద హీరోయిన్ కాన‌ప్ప‌టికీ మంచి సింగ‌ర్. యూట్యూబ్ లో బాగా ఫేమ‌స్ అయిన గాయ‌ని. దిల్ వాలే సినిమాలో పాడిన ఓ పాట‌తో ఈ భామ‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. కొన్ని సినిమాల్లో న‌టించినా వ‌ర్క‌వుట్ కాలేదు.
Tags:    

Similar News