నలుగురు దర్శకులు.. 4 కుట్టి లవ్‌ స్టోరీస్...!

Update: 2020-09-03 08:10 GMT
దక్షిణాది ప్రముఖ దర్శకులు గౌతమ్‌ వాసుదేవ్ మీనన్ - వెంకట్‌ ప్రభు - విజయ్‌ - నలన్‌ కుమారస్వామి నలుగురు కలిసి ''కుట్టి లవ్‌ స్టోరీ'' పేరుతో ఓ వెబ్ సిరీస్‌ ను తెరకెక్కిస్తున్నారు. నాలుగు విభిన్నమైన ప్రేమకథలతో వైవిధ్యభరితంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ని ఈశారి గణేష్ సమర్పణలో వేల్స్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అశ్విన్ కుమార్ ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా 'కుట్టి లవ్‌ స్టోరీ' కి సంబంధించిన టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లో నలుగురు దర్శకుల వాయిస్ ఓవర్ తో నాలుగు భిన్నమైన ప్రేమ కథాంశాలకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తున్నట్లు చూపించారు. దీనికి కార్తీక్ నేపథ్య సంగీతం అందించాడు. ''ప్రేమ కోసం నలుగురు దర్శకులు .. నాలుగు కుట్టి ప్రేమ కథలు..'' అంటూ విడుదలైన ఈ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.

కాగా బాలీవుడ్ లో నలుగురు ఐదుగురు దర్శకులు కలిసి ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది సౌత్ ఇండస్ట్రీలో కూడా స్టార్ట్ అయింది. ఈ సిరీస్ లో 30 నిమిషాల నిడివితో ఉండే ఒక్కో స్టోరీని ఒక్కో దర్శకుడు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ నాలుగు కథల్లో నటిస్తున్న నటీనటులెవరన్నది త్వరలోనే ప్రకటిస్తారు. 'కుట్టి లవ్‌ స్టోరీ' వెబ్ సిరీస్‌ ను త్వరలోనే ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం.
Full View
Tags:    

Similar News