2023 లో లేడీ సూప‌ర్ స్టార్ హ‌వా...?

Update: 2022-12-27 03:57 GMT
త‌లైవిగా త‌మిళ ప్రేక్ష‌కుల నుంచి గౌర‌వం అందుకుంటోంది న‌య‌న‌తార‌. ద‌క్షిణాది ప్రేక్ష‌కులు లేడీ సూప‌ర్ స్టార్ గా గౌర‌వించి అభిమానిస్తున్నారు. ద‌శాబ్ధంన్న‌ర పైగా సాగిన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొన్ని ప‌రాజ‌యాలు ఎదుర‌య్యాయి. అయితే జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అవ‌కాశాలు అందుకేనే స్టార్ డ‌మ్ త‌న సొంత‌మైంది.

కానీ నయనతార కు 2022 ఏమంత క‌లిసి రాలేద‌న్న‌ది వాస్త‌వం. వ‌రుస‌గా నాలుగైదు సినిమాలు రిలీజైనా వాటిలో ఏవీ స‌రైన విజ‌యం సాధించ‌లేదు. ఇటీవల విడుదలైన గోల్డ్ - కనెక్ట్ అనే రెండు చిత్రాలు ప‌రాజ‌యం పాల‌య్యాయి.

డిసెంబర్ మొదటి వారంలో విడుదలైన 'గోల్డ్' చిత్రం ఎలాంటి జాడలు లేకుండా పోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్ట‌రైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. ఈ మలయాళీ చిత్రం తమిళంలోనూ విడుదలైంది. దురదృష్టవశాత్తు యావరేజ్ గా కూడా నిల‌బ‌డ‌లేక‌పోయింది.

గత గురువారం అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్' మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకున్నా..  ఇది కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలలో థియేట‌ర్ల‌కు  ఆకర్షించడంలో విఫలమైంది. నయనతార తన సినిమాను ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ప్రీమియర్ లకు హాజరైంది కానీ అది సినిమా విధిని మార్చలేదు.

ఈ సంవత్సరం న‌య‌న‌తార నటించిన ఇతర సినిమాలు O2 ప‌రాజ‌యం పాలైంది. అయితే గాడ్ ఫాదర్ తెలుగులో విజ‌యం సాధించినా ఈ విజ‌యం మెగాస్టార్ ఖాతాలోనే ప‌డిపోయింది. దీనివ‌ల్ల త‌లైవి న‌య‌న‌తార‌ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఇక కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెడుతున్న వేళ త‌లైవి ప్రేక్షకులను అలరించే మంచి స్క్రిప్ట్ లను ఎంచుకోవాలని ఫేవ‌రెట్ ని అభ్యర్థిస్తున్నారు.  

ప్ర‌స్తుతం న‌య‌న‌తార త‌మిళ‌ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కిస్తున్న జ‌వాన్ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది.  షారుఖ్ ఖాన్ లాంటి ఎవ్వ‌ర్ గ్రీన్ హీరో స‌ర‌స‌న ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని తాను కూడా పాన్ ఇండియా రేస్ లో చేరాల‌ని త‌హత‌హ‌లాడుతోంది. జ‌వాన్ 2023లో విడుద‌ల‌వుతోంది. ఈ సినిమాతో పాటు ప‌లు భారీ ప్రాజెక్టుల‌కు న‌య‌న్ క‌మిట్ మెంట్లు ఇచ్చింద‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది త‌లైవి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో కంబ్యాక్ అవుతుంద‌నే అభిమానులు భావిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News