టాక్సిక్: గ్లింప్స్ తోనే నెంబర్ వన్ రికార్డ్.. టాప్ లిస్ట్ ఇదే!

ఇక రీసెంట్ గా యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.;

Update: 2025-01-09 08:00 GMT

కేజీఎఫ్ సిరీస్‌తో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం నటిస్తున్న టాక్సిక్ సినిమాపై కూడా బజ్ గట్టిగానే ఉంది. ఇక రీసెంట్ గా యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల్లోనే 36 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ స్థాయిలో ఆకర్షణీయమైన రిస్పాన్స్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. టాక్సిక్ గ్లింప్స్‌కు వచ్చిన ఆదరణ యశ్‌పై అభిమానుల అంచనాలను మరోమారు నిర్ధారించింది.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: వేర్ ఈజ్ పుష్ప కూడా గతంలో భారీ వ్యూస్ సాధించింది. హిందీ వెర్షన్ విడుదలైనప్పుడే 27.67 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ సెట్ చేసింది. ఈ చిత్రంలోని మాస్ యాక్షన్ సీన్స్, డైలాగ్‌లకు ప్రత్యేక ఆకర్షణ లభించింది. అలాగే, తెలుగు వెర్షన్ కూడా 20.45 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ ఒక్క గ్లింప్స్ తోనే సినిమాకు కావాల్సినంత హైప్ దక్కింది. కానీ గ్లింప్స్ లో ఉన్న కంటెంట్ మాత్రం సినిమాలో హైలెట్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

జూనియర్ ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ కూడా భారీ వ్యూస్ సాధించింది. తెలుగు వెర్షన్ 26.17 మిలియన్ల వ్యూస్ అందుకోగా, హిందీ వెర్షన్ 18.57 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాలను స్పష్టంగా చూపించారు. ఇది కూడా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నేపథ్యంలో దేవరకి అన్ని భాషల ప్రేక్షకుల నుంచి సపోర్ట్ పెరిగింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం గ్లింప్స్ కూడా బిగ్ హిట్ గా నిలిచింది. 24 గంటల్లో 20.98 మిలియన్ల వ్యూస్ సాధించి మరో రికార్డుని చేరింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్‌కు చేరువైంది.

సూర్య కంగువ సినిమా గ్లింప్స్ కూడా 20.77 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ చిత్రం విజువల్స్ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్ రికార్డులు భారతీయ సినీ పరిశ్రమలో మారుతున్న ట్రెండ్ ను చూపిస్తున్నాయి. ఇప్పుడు చిత్ర విజయానికి కంటెంట్ ప్రమోషన్ కీలక పాత్ర పోషిస్తోంది. యశ్ నటించిన టాక్సిక్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ పాత రికార్డులను తిరగరాస్తోంది.

1. టాక్సిక్ – 36M

2. పుష్ప 2: వేర్ ఈజ్ పుష్ప (హిందీ) – 27.67M

3. దేవర (తెలుగు) – 26.17M

4. గుంటూరు కారం – 20.98M

5. కంగువ – 20.77M

6. పుష్ప 2: వేర్ ఈజ్ పుష్ప (తెలుగు) – 20.45M

7. దేవర (హిందీ) – 18.57M

Tags:    

Similar News