ఎక్కించు ఇంకా హైప్ ఎక్కించు అంటున్న దేవరకొండ ఫ్యాన్స్..!
ఈ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతుంది.
తన కటౌట్ కి తగిన హిట్ సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ. కెరీర్ మొదట్లోనే తన స్టామినా ఇది అని ప్రూవ్ చేసి యూత్ ఆడియన్స్ ని తన అభిమానులుగా చేసుకున్న విజయ్ దేవరకొండ హిట్టు సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతను చేస్తున్న సినిమాలు కూడా భారీ అంచనాలతో వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతుంది.
జెర్సీ తర్వాత గౌతం డైరెక్ట్ చేస్తున్న సినిమాగా ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే సితార బ్యానర్ నుంచి ఈమధ్య వరుస సినిమాలు వస్తుండగా ఆ సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత నాగ వంశీ విజయ్ దేవరకొండ సినిమా గురించి స్పెషల్ గా చెబుతూ వస్తున్నారు. ఈమధ్యనే సినిమా రెండు భాగాలుగా వస్తుందని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన నాగ వంశీ లేటెస్ట్ గా మళ్లీ విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమా మీరు ఏమాత్రం ఊహించని విధంగా ఉంటుందని.. సినిమా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నాడు. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు నాగ వంశీ. నిర్మాతగా సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే అది వస్తున్న అవుట్ పుట్ చూసి ఒక ఐడియా వస్తుంది. అందుకే దాన్ని చూసే నాగ వంశీ ఇలా విజయ్ దేవరకొండ సినిమా మీద హైప్ పెంచేస్తున్నారని అంటున్నారు.
సితార నాగ వంశీ విజయ్ దేవరకొండ సినిమాపై పెంచుతున్న హైప్ చూసి ఫ్యాన్స్ మరింత సర్ ప్రైజ్ అవుతున్నారు. అంతేకాదు నువ్వు ఇంకా హైప్ ఎక్కించు అనేస్తున్నారు. ఏది ఏమైనా నాగ వంశీ కామెంట్స్ మాత్రం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. సూపర్ హిట్ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయ్ కి ఈ సినిమా నిజంగానే హిట్ పడితే మాత్రం ఆ లెక్క నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ 12వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.