ట్రైల‌ర్ టాక్‌: ల‌క్కు హ‌గ్గిచ్చేలోపే... అన్ ల‌క్కు!

Update: 2016-11-23 03:58 GMT
మంచు విష్ణు వినోదాల బాట‌ని వీడడం లేదు. ఆయ‌న‌కి యాక్ష‌న్ క‌థ‌ల‌కంటే కామెడీ క‌థ‌లే బాగా అచ్చొచ్చాయి. అందుకే ప్రేక్ష‌కులు కోరుకొంటున్నట్టుగా కిత‌కిత‌లు పెట్టించే క‌థ‌ల్లో న‌టించ‌డంపైనే మొగ్గు చూపుతున్నాడు. ఈడోర‌కం ఆడోర‌కం సినిమాతో వ‌చ్చిన హిట్టుని నిల‌బెట్టుకోవాల‌నే త‌ప‌న‌తో ఆయ‌న ఆచితూచి `ల‌క్కున్నోడు` స్క్రిప్టుని ఎంపిక చేసుకున్నాడు. రాజ్‌ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆ సినిమా ప్ర‌స్తుతం సెట్స్‌ పై ఉంది. మంచు విష్ణు పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ట్రైల‌ర్‌ ని విడుద‌ల చేశారు.

దాన్ని చూస్తుంటే ప‌క్కా మంచు విష్ణు మార్క్ కామెడీ  క‌థ‌తో తెర‌కెక్కిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ల‌క్కీ అని పేరు పెట్టుకొన్న ఓ అన్‌ ల‌క్కీ కుర్రాడిగా మంచు విష్ణు పాత్ర‌ని డిజైన్ చేశారు. ల‌క్కు హ‌గ్గిచ్చేలోపు అన్‌ ల‌క్కు లిప్పులాకు ఇస్తోంద‌నే  డైలాగ్‌ ని బ‌ట్టే క‌థెలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ల‌క్కీకి ద‌గ్గ‌రైన‌వాళ్ల‌కి కూడా చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మనే విషయాన్ని ప్ర‌భాస్ శ్రీను - స‌త్యం రాజేష్ చెప్పిన పాత్ర‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. హ‌న్సిక‌ - విష్ణుల‌ది విజ‌యవంత‌మైన జోడీ. మ‌రోసారి ఆ ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండిన‌ట్టు క‌నిపిస్తోంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News