పిడికిలి బిగించి బ‌రిలోకి దిగుతోన్న`ఈటి`

Update: 2022-02-12 13:30 GMT
కోలీవుడ్ హీరో సూర్య బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా ఓటీటీలో త‌న సినిమాల్ని రిలీజ్ చేస్తూ విజ‌యప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. `స‌రూరై పొట్టు` త‌ర్వాత ఇటీవ‌లే జైభీమ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన రెండు సినిమాలు పెద్ద విజ‌యాన్ని సాధించాయి.

ఇక `జైభీమ్` చిత్రాన్ని మెచ్చ‌ని ప్రేక్ష‌కులు లేరు. ఆస్కార్  రేంజ్  మూవీ అంటూ కితాబులు అందుకున్నారు. త‌మిళ‌నాడు లో జ‌రిగిన ఓ వాస్త‌వ సంఘ‌ట‌న అధారంగా తెర‌కెక్కిన సినిమా భార‌త రాజ్యంగం క‌ల్పించిన  హ‌క్కుల గురించి ఎంతో గొప్ప‌గా చెప్పే ప్ర‌య‌త్నం ప్ర‌శంస‌నీయం.

అన్యాయంపై ఓ గిరిజ‌న మ‌హిళ చేసిన న్యాయ పోరాటం  ప్రేక్ష‌కుల్నిఎంత‌గానో క‌దిలిచింది. తాజాగా సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఎత్త‌రాకం తున్నైదావ‌న్` చిత్రం తెలుగులో `ఈటి` టైటిల్ తో అనువాద‌మ‌వుతోంది. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 10న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతుంది.

తెలుగు అనువాద హ‌క్కుల్ని ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్ స్ ప్ర‌యివేట్ లిమిటెడ్ ద‌క్కిచుకుంది. రిలీజ్ తేదీ పోస్ట‌ర్ లో సూర్య పంచెగ‌ట్టి పిడికిలి బిగించి బ‌రిలోకి దిగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.  ఇక ఈ సినిమాలో సూర్య స‌మ్ థింగ్  స్పెష‌ల్ గా హైలైట్ అవుతున్నారు. నేరుగా తెలుగు వెర్ష‌న్ ఆయ‌నే డ‌బ్బింగ్ చెబుతున్నారు.  ఇప్ప‌టివ‌ర‌కూ డ‌బ్బింగ్ ఆర్టిస్టుల‌ పై ఆధార‌ప‌డిన  సూర్య `ఈటి` విష‌యంలో తానే స్వ‌యంగా రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రి సూర్య ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని  సాహ‌సం ఇప్పుడే ఎందుకు చేస్తున్న‌ట్లు?  అంటే ప్ర‌స్తుతం  కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్..విజ‌య్ లు ఇప్ప‌టికే టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో క‌మిట్ అయి ఉన్నారు. తెలుగు సినిమా అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకుంది.

బాలీవుడ్ కి పోటీగా టాలీవుడ్ ఎదుగుతోంది. ఇవ‌న్నీ విశ్లేషించే ఇన్నాళ్లు లైట్ తీసుకున్న కోలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగు సినిమాని సైతం సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అలా సూర్య కూడా తెలుగు నేర్చుకుని ముందుగా `ఈటి` సినిమాకు త‌న పాత్ర‌కు  తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. `ఈటి`లో ప్రియాంక మోహ‌న‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.  ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ.  


Tags:    

Similar News