వసంతం నన్ను పాడ‌మ‌ని కోరుతోంది కానీ..!

Update: 2023-06-23 20:02 GMT
కాబోయే మెగా కోడ‌లు లావ‌ణ్య‌ త్రిపాఠి త‌న లైఫ్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాధిస్తోంది. ఇటీవ‌ల మెగా ప్రిన్స్ తో నిశ్చితార్థ వేడుక ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. కాబోయే భర్త వరుణ్ తేజ్ కొణిదెల‌తో క‌లిసి జంట‌గా ఉన్న ఫోటోలు ట్రెడిష‌న‌ల్ అవ‌తార్ లో ఉన్న ఫోటోలు ఇటీవ‌ల వైర‌ల్ గా మారాయి. ఇంత‌లోనే లావణ్య షేర్ చేసిన తాజా ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

బ్లాక్ టాప్.. బ్లాక్ అండ్ బ్రౌన్ లాంగ్ ఫ్రాక్ ధ‌రించిన లావ‌ణ్య ఒక అంద‌మైన న‌ది ఒడ్డున స్టైలిష్ గా ఫోజులిచ్చింది. కాబోయే వ‌ధువు అల్ట్రా మోడ్ర‌న్ లుక్ ఎంతో స్పెష‌ల్ గా ఉందంటూ ఈ ఫోటోల‌కు లైక్ లు క్లిక్ లు హోరెత్తుతున్నాయి. ఈ ఫోటోలతో పాటు లావ‌ణ్య త‌న అభిమానుల కోసం స్వీటెస్ట్ మెసేజ్ ని జోడించింది.

''వసంతం నన్ను పాడ‌మ‌ని కోరుతోంది...కానీ నా స్నేహితులు నన్ను అభ్యర్థించవద్దు!'' అంటూ కాంట్రాస్ట్ కొటేష‌న్ ని ఇచ్చింది కొంటెగా. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. లావణ్య తన నిశ్చితార్థం జరిగిన రోజును ఒక మధురమైన కలగా అభివర్ణించింది. త‌న‌లోని ఆనందాన్ని ప్రతిబింబించే కొటేష‌న్ ఇది. లావ‌ణ్య హృదయపూర్వక సందేశం అభిమానుల గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. వరుణ్ సోదరి నిహారిక కొణిదెల లావ‌ణ్య షేర్ చేసే ప్ర‌తి ఫోటోపైనా స్పందిస్తోంది. ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తోంది.

లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ త‌మ అనుబంధాన్ని మ‌రో స్థాయికి చేర్చాల‌ని నిర్ణయించుకునే ముందు చాలా సంవత్సరాలు తమ సంబంధాన్ని ప్రైవేట్ గా ఉంచారు. జూన్ 9 న హైదరాబాద్ లోని వరుణ్ నివాసంలో వారి నిశ్చితార్థ వేడుక జరిగింది.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగా అల్లు కుటుంబ సభ్యులు లావ‌ణ్య త‌ర‌పు కుటుంబ స‌భ్యులు బంధువులు ఈ వేడుక‌కు హాజరయ్యారు. ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను షేర్ చేయ‌డం ద్వారా తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది వారి అభిమానులలో ఉత్సాహం నింపింది.

లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ ల ప్రేమాయ‌ణం మిస్టర్-అంతరిక్షం వంటి చిత్రాలలో కలిసి పని చేస్తున్నప్పుడు వికసించింది. 2016లో ఇరువురి న‌డుమా డేటింగ్ ప్రారంభమైంది. వరుణ్ గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన డైమండ్ రింగ్ తో త‌న‌కు ప్రపోజ్ చేశాడని త‌మ బంధాన్ని అధికారికం చేసుకున్నామ‌ని లావ‌ణ్య ఇటీవ‌ల వెల్ల‌డించారు.  లావణ్యపై వరుణ్ ప్రేమ అనంత‌మైన‌ది. ఈ జంట త్వ‌ర‌లో మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతోంది. మ‌రోవైపు ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. పెళ్లి త‌ర్వాత ఎవ‌రికి వారు న‌ట‌నా రంగంలో కొన‌సాగుతారు.

Similar News