'అఖండ-2'లో యాక్షన్ సంచలనం 'డెడ్ లీ దత్'!
సీక్వెల్ లోబాలయ్య శివ తాండవం ఊహకి కూడా అందని విధంగా బోయపాటి డిజైన్ చేసారు.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య 'అంఖడ-2' పాన్ ఇండియాలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సీక్వెల్ లోబాలయ్య శివ తాండవం ఊహకి కూడా అందని విధంగా బోయపాటి డిజైన్ చేసారు. బాలయ్య మాస్ ఇమేజ్...అఖండతో పాన్ ఇండియాలో క్రియేట్ అయిన బజ్ నేపథ్యంలో పార్ట్ 2 మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ విలన్ గా ఆదిపినిశెట్టిని ఫైనల్ చేసారు.
బాలయ్య- ఆది మధ్య ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాకే ఈ ఫైట్ సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంచనాలున్నాయి. దీంతో ఆది నే మెయిన్ విలన్ గా అంతా భావిస్తున్నారు. అయితే బోయపాటి అంతకు మంచి ప్లాన్ చేస్తన్నాడని గెస్ చేయలేకపోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తీసుకొస్తున్నట్లు వినిపిస్తుంది. ఇందులో అసలైన ప్రతి నాయకుడి బాధ్యతలు దత్ కి అప్పగిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సంజయ్ దత్ తో బోయపాటి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దత్ ఎంట్రీ కనుక ఖాయమైతే? విలన్ పాత్ర మామూలుగా ఉండదు. సాధారణ నటీనటుల్నే బోయపాటి యాక్షన్ సన్నివేశాల్లో ఓ రేంజ్లో లాంచ్ చేస్తుంటారు. ఇది బోయపాటికి మాత్రమే చెల్లింది. అలాంటింది సంజయ్ దత్ లాంటి యెగ్రసివ్ నటుడితో ఇంకే రేంజ్లో అద్భుతాలు సృష్టిస్తాడో చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య-సంజయ్ దత్ మధ్య వార్ పీక్స్ లోనే ఉంటుంది.
సంజయ్ దత్ ఇప్పటి వరకూ రెండు తెలుగు సినిమాలే చేసారు. 1998లో నాగార్జున హీరోగా నటించిన 'చంద్రలేఖ'లో నటించారు. ఆ తర్వాత మళ్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ రీమేక్ 'జంజీర్' లో నటించారు. తెలుగులో 'తుఫాన్' గా రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ దత్ తెలుగు సినిమా చేయలేదు. పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్ 2' లో విలన్ గా నటించారు. అదే దత్ చివరి సౌత్ చిత్రం. మళ్లీ 'అఖండ2' లో విలన్ అంటూ ప్రచారం తో సంజయ్ దత్ పేరు నెట్టింట మారు మ్రోగిపోతుంది.