'భీమ్లా నాయక్' విడుదలపై లేటెస్ట్ అప్డేట్..!

Update: 2022-02-09 17:30 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ సినిమా రిలీజ్ డేట్ ని ఆల్మోస్ట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల 'భీమ్లా నాయక్' నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చి నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలనుకున్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఇప్పుడు జగన్ సర్కారు ఫిబ్రవరి 15న తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూలు మరియు 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు సమాచారం అందుతోంది.

అంతేకాదు సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని సవరించి.. ఇండస్ట్రీకి అనుకూలమైన కొత్త జీవో తీసుకురావాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గురువారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అన్ని విషయాలపై చర్చించి సమస్యను ఓ కొలిక్కి తీసుకురానున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25న తేదీనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను బ్లాక్ చేయమని చెప్పి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారట. ఈలోపు పవన్ కళ్యాణ్ పెండింగ్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఫినిష్ చేయాలని చిత్ర బృందం రెడీ అవుతోందట.

అలానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టీఎఫ్‌ఐ సమావేశం తర్వాత 'భీమ్లా నాయక్' సినిమా విడుదల ప్రకటన ఉంటుందని సమాచారం.

కాగా, 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ గా ''భీమ్లా నాయక్'' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 'వకీల్ సాబ్' సినిమా తర్వాత పవన్ నుంచి రాబోతున్న ఈ రీమేక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News