'లైగ‌ర్' వారితోనూ ఫైట్ చేయాల్సిందే.. ప‌డగొడ‌తాడా..? ప‌డిపోతాడా..?

Update: 2021-02-24 01:30 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వ‌స్తున్న క్రేజీ మూవీ 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్‌' అంటూ వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ ఆడియ‌న్స్ ను ఫుల్లుగా అట్రాక్ట్ చేసింది. దీంతో.. ఈ చిత్రంపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. సుమారు 120 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్ప‌టికే లాక్ చేశారు మేక‌ర్స్‌!

ఈ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆ త‌ర్వాతి రోజు శుక్రవారం వినాయక చవితి సెలవు రావ‌డం.. ఆ త‌ర్వాత వీకెండ్ హాలీడేస్ కావ‌డంతో.. క‌లెక్ష‌న్స్ బాగుంటాయ‌ని ఈ డేట్ ను ఫిక్స్ చేసింది ‌యూనిట్‌. అదేరోజున తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల విడుద‌ల కానుంది.

అయితే.. ఇప్పుడు లైగ‌ర్ ఇత‌ర సినిమాల‌తోనూ ఫైట్ చేయాల్సిన ప‌రిస్థితి రాబోతోంది. సాధార‌ణంగా శుక్ర‌వారం సినిమాలు రిలీజ్ కావ‌డం సంప్ర‌దాయ‌మే. సెప్టెంబ‌ర్ 10వ తేదీ ఫ్రైడే అవుతోంది. దీంతో.. ఆ రోజున ఏ సినిమా విడుద‌ల‌వుతుందనే క్లారిటీ నిన్నామొన్న‌టి వ‌ర‌కూ లేదు. అయితే.. ఇప్పుడు పోటీదారుడు వ‌చ్చేశాడు. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్ నటించిన 'భూత్ పోలీస్' అనే బాలీవుడ్ హార్రర్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతోంది.

అంటే.. బాక్సాఫీస్ రింగ్ లో 'లైగ‌ర్' స్వేచ్ఛ‌గా వీరవిహారం చేయడానికి ఒకే ఒక రోజు ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ డే.. 'భూత్ పోలీస్' పోటీగా వచ్చేస్తుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి.. అప్పటి వరకు ఇంకా ఏమైనా చిత్రాలు బరిలోకి వస్తాయా? అన్న‌ది తెలియ‌దు. ఇది బాలీవుడ్ ప‌రిస్థితి. ఇక‌, టాలీవుడ్ లో కూడా ఇలాంటి కండీష‌న్ ఎదుర‌వ‌డం గ్యారంటీ. సెప్టెంబ‌ర్ 10వ తేదీన ఏదో ఒక చిత్రం రిలీజ్ కు త‌ప్ప‌కుండా ఉండే ఛాన్స్ ఉంది. అది, పెద్దదా? చిన్న సినిమానా? అన్న‌ది చూడాలి.

ఈ విధంగా.. లైగ‌ర్ మూవీ అన్ని ఇండ‌స్ట్రీల‌లోనూ ప్ర‌త్య‌ర్థుల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబ‌ట్టి, ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించాలంటే.. త‌న పెర్ఫార్మెన్స్ మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాధ్ కాబ‌ట్టి.. ఆయ‌న టేకింగ్ ఏ మాత్రం క్లిక్ అయినా ఆ క‌థ వేరే ఉంట‌ది. మ‌రి, ఫైన‌ల్ గా లైగ‌ర్ క‌ప్పు గెలుస్తాడో లేదో చూడాలి. అనన్య పాండే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News