ఇప్పటికే రెండుసార్లు పెళ్లయ్యింది. విడాకులు కూడా అయ్యాయి. అయితే.. ఇప్పుడు మూడో వాడి కోసం వెతుకున్నా అంటోంది హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్. ప్రస్తుతం సింగిల్ గానే కాలం నెట్టుకొస్తున్న ఈమె.. మంచి ప్రియుడి కోసం వెతుకుతున్నట్టు తెలిపింది. అయితే.. కండీషన్స్ అప్లై అని చెబుతోంది.
80వ దశకంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జెన్నిఫర్.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత 31 ఏళ్లకు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. 2000 సంవత్సరంలో హాలీవుడ్ లో వెలిగిపోతున్న సమయంలోనే సూపర్ స్టార్ బ్రాడ్ ఫిట్ ను పెళ్లాడింది. సరిగ్గా ఐదేళ్లు కొనసాగిన వీరి వైవాహిక జీవితం 2005లో ముగిసిపోయింది.
ఆ తర్వాత పదేళ్లపాటు సింగిల్ స్టేటస్ నే కంటిన్యూ చేసిన అనిస్టన్.. 2015లో జస్టిన్ తెరోక్స్ ను పెళ్లి చేసుకుంది. కానీ.. వీరి రిలేషన్ లైఫ్ టైమ్ మరీ తక్కువకే ముగిసిపోయింది. రెండేళ్ల తర్వాత 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్న జెన్నిఫర్.. మరోసారి రిలేషన్ షిప్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
అయితే.. పెళ్లి మాత్రం చేసుకునే ఉద్దేశం లేదని తెలిపింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ వచ్చే వాడు కూడా లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే అభిలాష ఉన్నవాడై ఉండాలని చెప్పింది. అలాంటి వాడు దొరికితే పెళ్లితో సంబంధం లేకుండా సహజీవనం కొనసాగించాలని ఆశపడుతున్నట్టు తెలిపింది. అన్నట్టు.. ఇప్పుడు అనిస్టన్ వయసు ఎంతో తెలుసా? 52 ఏళ్లు. మరి, లేటు వయసులో ఈ బ్యూటీ చేయి పట్టే సుందరాంగుడు ఎవరో? ఎప్పుడు వస్తాడో చూడాలి.