సీనియర్ స్టార్ లు ఆరు పదుల వయసు దాటుతున్నా సరే ఇప్పటికీ అదే జోష్ తో యంగ్ హీరోలతో పోటా పోటీగా హుక్ స్టెప్స్ వేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో నిలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్ గా 'బాస్ పార్టీ ' అంటూ తనదైన మార్కు స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతిహాపన్ హీరోయిన్ గా నటిస్తోంది.
సంక్రాంతి బరిలో దిగనున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ రీసెంట్ గా లిరికల్ వీడియోలతో మొదలు పెట్టేశారు. జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' రిలీజ్ కాబోతోంది. 'క్రాక్'తో ట్రాక్ లోకి వచ్చేసిన గోపీచంద్ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
చిత్రీకరణ పాట మినహా పూర్తయింది. ప్రస్తుతం చివరి పాటని చిత్రీకరిస్తున్నారు. శృతిహాసన్, బాలయ్యపై ఈ పాటని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్స్ జోరు పెంచబోతున్నారు. ఇదిలా వుంటే రీసెంట్ గా ఈ మూవీ నుంచి స్పెషల్ ఐటమ్ సాంగ్ గా 'మా బావ మనోభావాలు' అంటూ ఓ లిరికల్ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే.
తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. బాలయ్య, హనీరోజ్, చంద్రిక రవిలపై చిత్రీకరించిన దాబా సాంగ్ ఇది. ఈ పాటలో హాట్ లేడీ చంద్రిక రవి చేసిన గ్లామర్ షో కంటే బాలయ్య వేసిన హుక్ స్టెప్ లు, సోడా బండి వెనకాల వెళ్లకిలా వేళాడుతూ బాలయ్య చేసిన లెగ్ మూవ్ మెంట్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. 62 ఏళ్ల వయసులో బాలయ్య వేసిన హుక్ స్టెప్ లతో ఇప్పుడు 'మా బావ మనోభావాలు' లిరికల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అంతే కాకుండా ఈ పాట కోసం పేరున్న క్రేజీ హీరోయిన్ ని తీసుకుని వుంటే ఆ రేంజ్ వేరేలా వుండేదని కామెంట్ లు చేస్తున్నారట. చిరు నటిస్తున్న'వాల్తేరు వీరయ్య'లోని 'బాస్ పార్టీ' సాంగ్ కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ ఊర్వశీ రౌతేలాని తీసుకున్నట్టుగా బాలయ్య 'వీర సింహారెడ్డి' కోసం పేరున్న క్రేజీ లేడీని తీసుకుని వుంటే బాగుండేదని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
సంక్రాంతి బరిలో దిగనున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ రీసెంట్ గా లిరికల్ వీడియోలతో మొదలు పెట్టేశారు. జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' రిలీజ్ కాబోతోంది. 'క్రాక్'తో ట్రాక్ లోకి వచ్చేసిన గోపీచంద్ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
చిత్రీకరణ పాట మినహా పూర్తయింది. ప్రస్తుతం చివరి పాటని చిత్రీకరిస్తున్నారు. శృతిహాసన్, బాలయ్యపై ఈ పాటని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్స్ జోరు పెంచబోతున్నారు. ఇదిలా వుంటే రీసెంట్ గా ఈ మూవీ నుంచి స్పెషల్ ఐటమ్ సాంగ్ గా 'మా బావ మనోభావాలు' అంటూ ఓ లిరికల్ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే.
తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. బాలయ్య, హనీరోజ్, చంద్రిక రవిలపై చిత్రీకరించిన దాబా సాంగ్ ఇది. ఈ పాటలో హాట్ లేడీ చంద్రిక రవి చేసిన గ్లామర్ షో కంటే బాలయ్య వేసిన హుక్ స్టెప్ లు, సోడా బండి వెనకాల వెళ్లకిలా వేళాడుతూ బాలయ్య చేసిన లెగ్ మూవ్ మెంట్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. 62 ఏళ్ల వయసులో బాలయ్య వేసిన హుక్ స్టెప్ లతో ఇప్పుడు 'మా బావ మనోభావాలు' లిరికల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అంతే కాకుండా ఈ పాట కోసం పేరున్న క్రేజీ హీరోయిన్ ని తీసుకుని వుంటే ఆ రేంజ్ వేరేలా వుండేదని కామెంట్ లు చేస్తున్నారట. చిరు నటిస్తున్న'వాల్తేరు వీరయ్య'లోని 'బాస్ పార్టీ' సాంగ్ కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ ఊర్వశీ రౌతేలాని తీసుకున్నట్టుగా బాలయ్య 'వీర సింహారెడ్డి' కోసం పేరున్న క్రేజీ లేడీని తీసుకుని వుంటే బాగుండేదని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.