మహానటి.. ట్రెండ్ సెట్టింగేనా?

Update: 2018-05-09 04:16 GMT
ఇంకా శుక్రవారం రాలేదు. అప్పుడే కొత్త సినిమా వచ్చేసింది. వారం మధ్యలోనే.. బుధవారమే థియేటర్లలో సందడి మొదలైపోతోంది. ‘మహానటి’ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులో ఇదొక ప్రత్యేకమైన చిత్రం అనే చెప్పాలి. ఓ సినిమా ఆర్టిస్టు మీద తెలుగులో వస్తున్న అథెంటిక్ బయోపిక్ ఇదే. ఇంతకుముందెన్నడూ తెలుగులో ఇలాంటి ప్రయత్నం జరగని నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండొచ్చన్న అంచనాలు కూడా జనాలకు లేవు. ప్రోమోల వరకైతే ఒక గొప్ప సినిమా చూడబోతున్న భావన కలిగించింది. ఈ చిత్రానికి ఎంచుకున్న కాస్టింగే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. సాంకేతికంగా అన్ని హంగులూ బాగానే కుదిరినట్లున్నాయి. నిర్మాణ విలువల విషయంలోనూ రాజీ లేకుండా దర్శకుడికి కావాల్సినవన్నీ సమకూర్చి ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ గా మలచడానికి వైజయంతీ మూవీస్ అన్ని ప్రయత్నాలూ చేసింది.

మరి అన్ని వనరులనూ సద్వినియోగం చేసుకుని నాగ్ అశ్విన్ సావిత్రి కథను ఎంత బాగా చెప్పాడో.. సినిమాను ఎలా మలిచాడో చూడాలి. ఈ చిత్రం బాగుంటే మాత్రం ఇదొక కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో ఆల్రెడీ కొన్ని బయోపిక్స్ దిశగా అడుగులు పడ్డాయి. వాటికి ఇది ఒక నమూనాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సినీ తారల జీవితాల నేపథ్యంలో తెలుగులో మరిన్ని సినిమాలు రావడానికి ఇది దోహదం చేయొచ్చు. ఇలాంటి సినిమాలు ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి కాబట్టి.. దీని ఫలితంలో తేడా వస్తే మాత్రం ఆ తరహా ప్రయత్నాలు ముందు ముందు జరగవు. కానీ సినిమాకు క్రిటికల్ అక్లైమ్ వచ్చి.. డబ్బులు కూడా తేగలిగితే మాత్రం మున్ముందు మరిన్ని మంచి ప్రయత్నాలు జరిగే అవకాశముంది. మరి ‘మహానటి’ ట్రెండ్ సెట్ చేస్తుందా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.
Tags:    

Similar News