శాటిలైట్ - డబ్బింగ్ రైట్స్ - డిజిటల్ రైట్స్ అంటూ... సినిమాకి మహర్ధశ పట్టిందనే చెప్పాలి. బడ్జెట్‌లో కొంత రికవరీ వీటితో సాధ్యమవుతుండడంతో.. పలువురు నిర్మాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అగ్రనిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థల రాకతో డిజిటల్ విప్లవం మొదలైందని, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సినిమాలు చూసేందుకే ఆడియెన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. దీనివల్ల డిజిటల్ రైట్స్ రూపంలో తెలుగు సినిమాకి ఎంతో పెద్ద ప్లస్ అయ్యిందన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అందుకు తగ్గట్టే తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ - ఇతరత్రా బిజినెస్ ఉరకలెత్తుతోంది. రామ్ చరణ్ రంగస్థలం హిందీ రైట్స్ డీల్ 22 కోట్లు. ఎన్టీఆర్ అరవింద సమేత హిందీ రైట్స్ డీల్ 18కోట్లు పలికింది. ఇప్పుడు మహేష్ నటించిన మహర్షి హిందీ రైట్స్ గురించి మాటా మంతీ సాగుతోందని ప్రచారమవుతోంది. ఈ డీల్ ని 20కోట్లకు ఇప్పటికే క్లోజ్ చేశారన్న మాటా వినిపిస్తోంది. ఆ శుభవార్తతో పాటు మహర్షి డిజిటల్ రైట్స్ డీల్ కి సంబంధించి తాజాగా ఓ కీలక సమాచారం అందింది.
ఈ సినిమా డిజిటల్ రిలీజ్ హక్కుల్ని 12 కోట్లకు ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇది ఓ తెలుగు సినిమాకి చాలా పెద్ద మొత్తమే.. రికార్డు ధర పలికిందని విశ్లేషిస్తున్నారు. చరణ్ `రంగస్థలం` డిజిటల్ హక్కుల్ని 10కోట్లకు విక్రయించారు. అగ్రహీరోల సినిమాలకు 8-12కోట్ల రేంజులో డిజిటల్ రైట్స్ బిజినెస్ సాగుతుండడం ఆశావహమేనన్న మాటా వినిపిస్తోంది. `మహర్షి` చిత్రాన్ని దిల్‌రాజు-అశ్వనిదత్ -పీవీపీ త్రయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సమ్మర్ లో రిలీజ్ కానుంది.