ఏప్రియల్ 12.. గెట్ రెడీ మహేష్‌ ఫ్యాన్స్

Update: 2017-04-10 15:58 GMT
వీరావేశంలో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం ఇది. దాదాపు 10 నెలల క్రితం సినిమా మొదలుపెట్టి.. ఇంకో రెండు నెలల్లో రిలీజ్ పెట్టుకుని.. కనీసం ఫస్ట్ లుక్ కూడా ఇవ్వలేదు దర్శకుడు మహేష్ బాబు. ఈ విషయంలో సోషల్ మీడియాలో మురుగదాస్ ను ఓపెన్ గానే తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్.

అభిమానుల ఆవేశం తగ్గించడానికో.. లేక ముందుగా షెడ్యూల్ చేసిన డేట్ అదేనో చెప్పలేం కానీ.. ఇప్పుడు మహేష్ బాబు మూవీ ఫస్ట్ లుక్ కి డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5గంటలకు మహేష్ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు టీం నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో అభిమానులకు ఆవేశం స్థానంలో ఆతృత ఎంటరైపోయింది. ఎప్పుడెప్పుడు కొత్త సినిమా పోస్టర్ పై మహేష్ ను చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. స్పై-డర్ అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలిస్తుండగా.. ఫస్ట్ లుక్ తో పాటే ఈ విషయం వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

 మహేష్ బాబు ఇప్పటివరకూ కనిపించని కొత్త రూపంలో ఈ చిత్రంలో కనిపించనుండగా.. జేమ్స్ బాండ్ టైపులో సాగే స్ప్పై థ్రిల్లర్ అంటున్నాడు దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ 23న స్పైడర్ రిలీడ్ డేట్ ఫిక్స్ చేశరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News