మురుగ-మహేష్ మరో పోకిరి
మహేష్ బాబు సినిమాల్లో పోకిరి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిపోయే సినిమా. సూపర్ స్టార్ స్టామినా ఏ రేంజ్ లో ఉంటుందో టాలీవుడ్ బాక్సాఫీస్ కి టేస్ట్ చూపించిన మూవీ అది. ఫుల్లు మాస్ అవతారంలో మహేష్ రెచ్చిపోతే.. రికార్డులన్నీ షేక్ అయిపోయి బ్రేక్ అయిపోయాయి. అప్పటివరకూ ఉన్న రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేసి.. భారీ కలెక్షన్స్ ను వసూలు చేసిన ఈ మూవీ.. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయింది.
పోకిరీ రిలీజ్ కి 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు అదే తేదీని టార్గెట్ చేయడం ఇప్పుడు అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. మహేష్ తో మురుగదాస్ తెరకెక్కిస్తున్న మూవీ.. ప్రస్తుతం చెన్నైలో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. వచ్చే జనవరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా.. ఈ బైలింగ్యువల్ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పేశారు. అది కూడా 2017 ఏప్రిల్ 28న విడుదల చేయాలని మురుగ-మహేష్ టీం ఫిక్స్ అయింది.
మహేష్ చరిత్ర సృష్టించిన అదే రోజున.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బైలింగ్యువల్ థ్రిల్లర్ ని రిలీజ్ చేయాలని నిర్ణయించడంతో.. ఫ్యాన్స ఇప్పుడు తెగ ఖుషీ అయిపోతున్నారు. పోకిరికి మించి ఈ చిత్రం సంచలనాలు నమోదు చేస్తుందని.. ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలుకొట్టేస్తుందని ఆశలు పెట్టేసుకుంటున్నారు.