కథ చెప్పకుండా కైపెక్కిస్తున్న మహేష్‌

Update: 2016-10-12 13:20 GMT
మామూలుగా ఏ సినిమాకైనా కూడా.. ముందే ఇది కథ అని చెప్పేసి మనోళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ కూడా అదే పంథాలో వెళ్ళేవాడు. దాదాపు సినిమా మొదలైనప్పుడే.. ఈ సినిమాలో ఏముంది అనే విషయం అందరికీ అర్దమైపోతుంది. కాని ఇప్పుడు మాత్రం ఎందుకో కాస్త గప్ చుప్ సాంబార్ బుడ్డీ అన్నట్లు సైలెంటుగా తన బైలింగువల్ సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు.

షూటింగ్ మైదలైనప్పటి నుండి అసలు మహేష్‌ ను ఆన్ లొకేషన్లో చూస్తే మనకు ఏమర్ధమవుతుంది? అసలు వీళ్లు చేసే సినిమాలో మహేష్‌ ఒక సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని.. గూడఛారి సంస్థ ఏజెంట్ అన్నారు.. కాని ఎక్కడా అలాంటి ఛాయలు కూడా లేవు. సర్లే కాస్ట్యూమ్స్ చూస్తే అవన్నీ అర్ధంకావులే అనుకుందాం.. కాని ఒక్కోసారి కత్తులు గట్టా కనిపిస్తున్నాయి.. స్వయంగా మురుగుదాసే చూపిస్తున్నాడు. ఒక్కోసారి మాత్రం కొత్త కార్లకు పూజలు చేస్తున్నారు. గుళ్ళూ గోపురాలూ తిరిగేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏమైయుంటుంది అంటారూ?

సరిగ్గా అదే చెప్పకుండా అందరికీ కైపెక్కిస్తున్నాడు మహేష్‌ బాబు. మొత్తానికి దర్శకుడు ఏ.ఆర్.మురుగుదాస్ ఇప్పుడు మహేష్‌ తో ఏదో గమ్మత్తయిన సినిమా చేస్తున్నాడనమాట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News