టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ? ఇన్నాళ్లూ అయితే.. అబ్బే అదేం లేదనే చెప్పాలి కానీ.. ఇప్పుడు సూపర్ స్టార్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు స్టయిలే వేరు. తను బాలీవుడ్ వెళ్లేబదులు... తన సినిమానే పంపించాలని ప్లాన్ చేశాడు. శ్రీమంతుడుతో తన కెరీర్ లోనే కాకుండా, నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన ప్రిన్స్.. తన తర్వాతి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇప్పటికే మార్కెట్ పెంచుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు మహేష్. ఆల్రెడీ కర్నాటక - తమిళనాడుల్లో మహేష్ కు మంచి మార్కెట్ ఉంది. దీంతోపాటే హిందీలోనూ ఒకేసారి తన మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో రూపొందుతున్న బ్రహ్మోత్సవాన్ని తెలుగు - తమిళ్ - మళయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నాడు మహేష్ బాబు. తీయడానికి తెలుగులోనే తీసినా.. డబ్బడ్ వర్షెన్ మాత్రం అన్ని బాషల్లోనూ సమాంతరంగా తెలుగుతోపాటే విడుదలవుతుంది. ఇక ఆ తర్వాత రూపొందబోయే మురుగదాస్ చిత్రం.. దీనికి ఓ స్పెషాలిటీ ఉంది.
ఈ సినిమాను ఒకేసారి హిందీలో కూడా పిక్చరైజ్ చేస్తారట. గతంలో చాలాసార్లు బాలీవుడ్ ఆఫర్స్ వస్తే తిరస్కరించాడు మహేష్. తనకు ఇతర భాషలు కంఫర్ట్ గా ఉండవంటూ.. అప్పట్లో మాట దాటేసేవాడు. ఇప్పుడు తన స్థాయితోపాటు టాలీవుడ్ రేంజ్ ను కూడా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంద కోట్ల మార్క్ కు చేరువగా వచ్చిన మన శ్రీమంతుడు.. అన్ని మార్కెట్లలోన పాగా వేస్తే మాత్రం.. ఈ వంద కోట్లను ఈజీగానే దాటేస్తాడు.