సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ తర్వాత ‘మహర్షి’ సినిమాతో మనముందుకు వస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - ప్రసాద్ వి. పొట్లూరి - అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ టాలీవుడ్ లో ఆసక్తి రేపుతోంది. అగ్రహీరో మహేష్ ఇందులో ఐదారు గెటప్ లలో కనిపించబోతున్నాడని.. అందులోని స్టూడెంట్ పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ అందరినీ ఎంతగానో అలరించింది.
మహేష్ బాబు మహర్షి సినిమాలో స్టూడెంట్ గా మారిపోతున్నాడు. సినిమాలో స్టూడెంట్ పాత్రలో కొద్ది సేపు కనిపించబోతున్నాడట.. చాలా రోజుల తర్వాత మహేష్ ఈ తరహా పాత్రలో ఒదిగిపోతున్నాడు. ఆయన తొలినాళ్లలో బాబీ - వంశీ సినిమాల్లో స్టూడెంట్ గా నటించాడు. ఇక స్టార్ హీరోగా మారిన ‘ఒక్కడు’ సినిమాలో స్టూడెంట్ గా కబడ్డీ క్రీడాకారుడిగా నటించి తొలి గ్రాండ్ హిట్ అందుకున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నిజం’ సినిమాలో కూడా అమాయకపు విద్యార్థిగా అలరించాడు. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఇక సైనికుడు సినిమాలో పూర్తిస్థాయి స్టూడెంట్ నాయకుడిగా చేశాడు. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీసును అలరించలేదు. అర్జున్ - రాజకుమారుడు మూవీల్లో కూడా కొద్దిసేపు స్టూడెంట్ గా కనిపిస్తాడు. నాని సినిమాలో చిన్న పిల్లవాడిగా మహేష్ మారిపోతాడు. అలా స్టూడెంట్ అయ్యాడు. కానీ అది డైరెక్ట్ గా కాదు..
ఒక్కడు తర్వాత వచ్చిన ఏ సినిమాలో కూడా మహేష్ బాబు విద్యార్థిగా కనిపించలేదు. అతడు - ఖలేజా - పోకిరీ - బిజినెస్ మ్యాన్ - ఆగడు - దూకుడు - 1 నేనొక్కడినే లో కూడా ఆ పాత్రలు చేయలేదు...కానీ భరత్ అనే నేనులో మళ్లీ లండన్ లో పీజీ విద్యార్థిగా కనిపించి పట్టా తీసుకునే సన్నివేశంలో నటించాడు. ఇప్పుడు దాన్ని పునరావృతం చేస్తూ మరోసారి ‘స్టూడెంట్ ’గా మహర్షిలో కనువిందు చేయబోతున్నాడు.
మహేష్ స్టూడెంట్ అవతారం ‘ఒక్కడు’ - భరత్ అనే నేనులో వర్కవుట్ అయ్యింది. మిగతా సినిమాల్లో కలిసిరాలేదు. పాజిటివ్ కంటే నెగెటివ్ ఎక్కువ. కానీ కథపై నమ్మకంతో తీస్తున్న ఈ మూవీపై మాత్రం బోలెడు అంచనాలున్నాయి. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే మహేష్ కు మరోసారి ఈ స్టూడెంట్ అవతారం కలిసివస్తుందా లేదా అన్నది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.