ఖైదీ కలెక్షన్స్ తో స్పై సై అంటాడా

Update: 2017-04-04 14:23 GMT
మెగాస్టార్ చిరంజీవి 9 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా.. ఖైదీ నంబర్ 150 మూవీతో టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేశారు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాహుబలికి పోటీ ఇచ్చే సత్తా.. బాహుబలి2కి మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అందుకే ఇప్పుడు రికార్డులు లెక్కించినపుడల్లా బాహుబలి.. నాన్-బాహుబలి అని లెక్కిస్తున్నారు.

ఇప్పుడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ చిరు పేరిటే ఉంది. నిజానికి ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయ్యేవరకూ.. ఈ ప్లేస్ మహేష్ దే. శ్రీమంతుడుతో ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేసిన మహేష్.. ఏడాదిన్నరకు పైగా ఆ ప్లేస్ లో ధీమాగా నిలబడ్డాడు. అయితే.. చిరు ఇచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ కారణంగా.. శ్రీమంతుడుని ఖైదీ దాదాపు పాతిక కోట్ల షేర్ వసూళ్ల మార్జిన్ తో క్రాస్ చేసేశాడు. రీసెంట్ కాటమరాయుడు ఈ రికార్డ్ ను అదిగమిస్తుందని అంతా అనుకున్నా.. అది సాద్యం కాలేదు. ఇప్పుడు ఖైదీ రికార్డును కొట్టేసే సత్తా ఎవరికి ఉందని ప్రశ్న వస్తోంది.

బాహుబలి ది కంక్లూజన్ ను మినహాయిస్తే.. ఈ స్టామినా.. అవకాశం రెండూ మహేష్ కే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మురుగదాస్ తెరకెక్కిస్తున్న స్పై-డర్  తో ఖైదీ రికార్డును సూపర్ స్టార్ కొట్టేస్తాడనే అంచనాలున్నాయి. మరోవైపు డీజే-దువ్వాడ జగన్నాధం కూడా ఈ ఛాన్సులు ఉన్నాయనే టాక్ ఉన్నా.. డిజ్ లైక్స్ చూశాక కాసింత అనునించాల్సి వస్తోంది. మరి మహేష్ అయినా ఖైదీని కొట్టేస్తాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News