సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఉత్తరాదిలో చక్కర్లు కొడుతున్న ఈ మూవీ యూనిట్.. హరిద్వార్ - రిషికేష్ లలో షూటింగ్ కంప్లీట్ చేసి, ప్రస్తుతానికి ఉదయ్ పూర్ చేరుకున్నారు. త్వరలో వారణాసి కూడా వెళ్లి అక్కడ కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తర్వాత, హైద్రాబాద్ రానున్నారు. హైద్రాబాద్ లో తీయబోయే సీన్స్ తో - బ్రహ్మోత్సవంకి సంబంధించి షూటింగ్ పూర్తయిపోయినట్లే అంటున్నారు.
గత కొన్ని వారాలుగా ప్లాన్డ్ గా, ఫాస్ట్ గా పని చేయడంతో ముందు అనుకున్న దానికంటే త్వరగానే షూటింగ్ పార్ట్ పూర్తి కానుందని తెలుస్తోంది. దీంతో రిలీజ్ డేట్ విషయంలో కూడా ఆలోచనలో పడ్డారట బ్రహ్మోత్సవం యూనిట్. మే నెలలో రిలీజ్ చేస్తారనే వార్తలొచ్చినా.. ఇప్పుడు మాత్రం మహేష్ టీం నుంచి ఏప్రిల్ 29 డేట్ వినిపిస్తోంది. ఏప్రిల్ లోనే విడుదల చేసేలా ప్లాన్ చేసేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మహేష్ మూవీ ఏప్రిల్ లోనే థియేటర్ల ఇబ్బందులు వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 8న విడుదలయ్యే సర్దార్ గబ్బర్ సింగ్ పై పెద్దగా ఎఫెక్ట్ పడకున్నా.. ఏప్రిల్ 22న రిలీజ్ ప్లాన్ చేసిన సరైనోడుకి మాత్రం షాక్ తగిలే అవకాశం ఉంటుంది. మరి రిలీజ్ డేట్ విషయంలో మహేష్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో?