సినీరంగంలో గేమ్ ఛేంజర్: 10 వేల కోట్ల సంపదతో నం.1
యశ్రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కుటుంబానికి రూ.7,000 కోట్ల నికర ఆస్తులు... షారుక్ ఖాన్ కుటుంబానికి రూ. 6,000 కోట్ల నికర ఆస్తులు ఉన్న విషయం తెలిసినదే.
ఖాన్ లు, కపూర్ లు, బచ్చన్ లు, రోషన్ లు ఏలిన ప్రత్యేక ప్రపంచంగా బాలీవుడ్ ని భావిస్తారు. వారంతా ధనవంతులే .. కానీ, వారికి భిన్నమైన ప్రపంచం నుంచి వచ్చి అందరినీ అధిగమించి ఏకంగా 10వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆ గ్రేట్ పర్సనాలిటీ ఎవరో తెలుసుకుని తీరాలి. ముగ్గురు ఖాన్ ల నికర ఆస్తులను కలపగా వచ్చే విలువ కంటే.. అతడి ఆస్తి విలువ ఎక్కువ. టీసిరీస్ యజమాని భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తుల గురించే ఇదంతా. బాలీవుడ్లో టీసిరీస్ గుల్షన్ కుమార్ ఆస్తులు 10,000 కోట్లు. యశ్రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కుటుంబానికి రూ.7,000 కోట్ల నికర ఆస్తులు... షారుక్ ఖాన్ కుటుంబానికి రూ. 6,000 కోట్ల నికర ఆస్తులు ఉన్న విషయం తెలిసినదే.
అయితే లెజెండరీ స్టార్ల కుటుంబ ఆస్తులను మించి టీసిరీస్ వేల కోట్ల ఆస్తులతో నంబర్ -1 గా నిలిచింది. టి-సిరీస్ అనే మ్యూజిక్ లేబుల్ కంపెనీని స్థాపించి దశాబ్ధాల ప్రస్థానంతో గుల్షన్ కుమార్ విజయాలు అప్పట్లో సంచలనం. ఆయన మరణానంతరం వారసుడు భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తులను పెంచడంలో సఫలమయ్యారు. ఆయన భారీ చిత్రాల నిర్మాతగాను గొప్ప విజయాల్ని చవి చూస్తున్నారు. కపూర్లు, బచ్చన్లు, ఖాన్ లు, జోహార్లు వంటి పాపులర్ సెలబ్రిటీల సంపదను మించి టి.సిరీస్ నికర ఆస్తులు పెరిగాయి.
భూషణ్ కుమార్ మ్యూజిక్ లేబుల్ తో పాటు, అగ్రనిర్మాతగా దూసుకెళుతున్నారు. అతడు టి-సిరీస్ మ్యూజిక్ లేబుల్కి ఛైర్మన్.. హురున్ ఇండియా రిచ్ సెలబ్ లిస్ట్ 2022 ప్రకారం.. భూషణ్ కుమార్ అతడి కుటుంబం దాదాపు రూ. 10,000 కోట్ల నికర ఆస్తులను కూడగట్టారు. టి -సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్కు అతని బాబాయ్ క్రిషన్ కుమార్ (మాజీ నటుడు, గుల్షన్ సోదరుడు) వ్యాపారంలో సహాయం చేస్తారు. అతడి సోదరి ఖుషాలి నటి కాగా, తులసి కుమార్ బాలీవుడ్లో గాయని. వారు కూడా ఫ్యామిలీ షోబిజ్లో భాగమే. భూషణ్ కుమార్ నటి కం దర్శకనిర్మాత దివ్య ఖోస్లా కుమార్ను వివాహం చేసుకున్నారు. నటి దివ్య ఖోస్లా కుమార్ టి-సిరీస్ కంపెనీలో 0.45 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే భూషణ్ కుమార్ వ్యక్తిగతంగా కేవలం 414 కోట్ల రూపాయల ఆస్తులను మాత్రమే కలిగి ఉన్నారని కథనాలొచ్చాయి.
ఐదు దశాబ్ధాల చరిత్ర తో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎన్నో బ్లాక్ బస్టర్లను నిర్మించింది. వైఆర్ఎఫ్ యజమాని ఆదిత్య చోప్రా కుటుంబానికి రూ.7,000 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. అలాగే ధర్మ ప్రొడక్షన్స్ యజమాని కరణ్ జోహార్ , అతడి కుటుంబం ఆస్తులు రూ. 1,700 కోట్లుగా అంచనా. బాలీవుడ్లో మొదటి కుటుంబంగా పేరుగాంచిన కపూర్ కుటుంబం చాలా మంది సూపర్స్టార్లను అందించింది. అయితే వారి మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలు.
దిగ్గజ హీరో కింగ్ ఖాన్ షారుక్ నికర ఆస్తుల విలువ రూ. 6000 కోట్లు. ఖాన్ అత్యంత సంపన్న భారతీయ నటుడిగా రికార్డులకెక్కారు. అతడి తర్వాత సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ. 2,900 కోట్లు కాగా, అమీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ. 1,862 కోట్లు. ఈ ముగ్గురి నికర ఆస్తుల విలువను ఏకమొత్తంగా చూస్తే రూ. 9,700 కోట్లు. భూషణ్ జీ ఆస్తుల విలువ కంటే షారూఖ్ ఆస్తి విలువ తక్కువ. ఖాన్ ల త్రయాన్ని కూడా వెనక్కి నెట్టేసిన స్థితిమంతుడు భూషణ్ కుమార్.