సినిమా రివ్యూ చేసేవారిని దారిన పోయే దానయ్యలంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో బాగానే వైరల్ అయ్యాయి. జైలవకుశ సక్సెస్ మీట్ లో భాగంగా ఎన్టీఆర్ తన స్పీచ్ లో ‘కొంతమంది విశ్లేషకులు’ అంటూ సినిమా పట్ల నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లపై తన మనసులోని కోపాన్ని మొత్తం బయటపెట్టాడు. అంతకుముందు అల్లు అర్జున్ కూడా దువ్వాడ జగన్నాథమ్ కు వచ్చిన నెగిటివ్ రివ్యూలపై ఫైరయ్యాడు. ఇదే విషయంలో ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం డిఫరెంట్ గా రియాక్టయ్యాడు.
మహేష్ లేటెస్ట్ మూవీ స్పైడర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో మీడియాతో సమావేశం అయ్యాడు. ఈ సందర్భంగా నెగిటివ్ రివ్యూలపై మీరు ఏమనుకుంటున్నారనే ప్రస్తావన రాగా.. ఈ విషయంలో అసలు వివాదాలు అనవసరమంటూ తన ఒపీనియన్ చెప్పాడు. ‘‘రివ్యూలపై ఇప్పుడు బోలెడు కాంట్రవర్సీలు వస్తుండటం వింటూనే ఉన్నాం. నేను వాటి జోలికి పోదలచుకోలేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను రివ్యూలు చూస్తుంటాను. సినిమా బాగుంటే పాజిటివ్ రివ్యూలు వస్తుంటాయి. సినిమా బాగోలేక పోతే నెగిటివ్ రివ్యూలు వస్తుంటాయి. ఇది సింపుల్ లాజిక్. అంతకు మించి నేను చెప్పగలిగేది ఏమీ లేదు. మా సినిమా చాలా బాగా వచ్చిందనే నేను నమ్ముతున్నా. కాబట్టి రివ్యూయర్ల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంటుందనే అనుకుంటున్నా. ఏమీ లేని దానికి ఈ వివాదాలు అన్ని ఎందుకో నాకు తెలియడం లేదు’’ అంటూ మహేష్ ఇష్యూను సింపుల్ గా మూడు ముక్కల్లో తేల్చేశాడు.
మహేష్ చెప్పిన మాటలు మీడియా పీపుల్ ను బాగానే ఇంప్రెస్ చేశాయి. అన్ని రకాల వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేలా మహేష్ చెప్పిన మాటలు ఉన్నాయనే అప్లాజ్ వచ్చింది. సినిమా బాగుంటే రివ్యూయర్ల అభిప్రాయం డిఫరెంట్ గా ఉన్నా ప్రేక్షకుల ఆదరణకు లోటుండదు.